గేదె జాతులు
భారతదేశంలో గేదె జాతులను 5 గ్రూపులుగా విభజించవచ్చు.
ముర్రా గ్రూపు (జాతులు – ముర్రా, నీలిరావి, కుంది);
గుజరాత్ గ్రూప్ (జాతులు – సుర్తి, మెహసానా, జఫరాబాది);
మధ్య భారతదేశపు గ్రూపు (నాగపురి, పండరపురి, మండా, జరంగి, కలహండి, సంబాల్పూర్, పర్లాకిమిడి);
ఉత్తరప్రదేశ్ గ్రూపు (బాధవారి, తారాయ్);
దక్షిణ భారతదేశపు గ్రూపు (తోడ, సౌత్ కెనరా).
మనదేశంలో ముర్ర మరియు గుజరాత్ గ్రూపు జాతులను మాత్రమే పాలకు ఉపయోగిస్తారు. మిగిలిన జాతులు పాలు తక్కువగా ఇస్తాయి. వీనిని ఎక్కుఅవగా పనికి ఉపయోగిస్తారు.