స్పాటెడ్ లీఫ్ బీటిల్
Scientific Name:  Epilachna vigintioctopunctata, Epilachna dodecastigma

వంకాయ, టమాట, కాకర కాయ  వంటి పంటలను ఆశిస్తుంది.

లక్షణాలు

చిన్నగా ఉండే పురుగులు  ఆకులఫై ఉండే తాజా పచ్చదనన్ని తింటూ, గుడ్లు పెదుతుంటాయి.  ఆకులలో ఈనెలు, వాటి ఇతర భాగాలు తప్ప మిగతా పచ్చదనం మొత్తం తినేస్తాయి. పెరిగిన పురుగులు గుంపులు గుంపులుగా ఉంటూ, విపరీతంగా ఆకులని తింటాయి.  చిన్న పురుగులు కానీ ,పెద్ద పురుగులు కానీ  ఆకుల కింది భాగాలనే ఎక్కువ తింటూ ఉంటాయి. అందువల్ల ఆకుల కింది భాగంలో తెల్లటి చారాల వంటి లక్షణాలు కనపడతాయి.. ఆకులలోని ఈనెల మధ్య భాగంలోని పచ్చదనం తినేయడం వల్ల ఈ తెల్లటి చారలు ఏర్పడతాయి.  దీనివల్ల ఆకులు పచ్చదనం లేని ఆస్థి పంజరం మాదిరిగా కనపడుతాయి.  పురుగు వల్ల కలిగే ప్రభావ తీవ్రతకు అనుగుణంగా తెగులు సోకిన ఆకులు ఎండిపోతుంటాయి. తీవ్రత చాలా ఉంటే,  మొక్కకు రోగం సోకిన లక్షణాలు స్పష్టంగా కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
పురుగు గుడ్లను ఆకుల కింద భాగంలో గుంపులుగా పెడుతుంది. 2 – ౩ రోజులలో ఇవి పొదగబడతాయి.  
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల  పురుగు దశ  10 నుంచి ౩5 రోజుల వరకు ఉంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఆకు పై భాగంలో ఈ దశను గడుపుతుంది.  ౩ నుంచి 6 రోజుల పాటు ఈ దశలో ఉంటుంది. 

తల్లి పురుగు
2 - ౩ రోజుల కోశాస్థ దశ తరువాత రెక్కల  పురుగు బయటికి వస్తుంది. జూలై  –  ఆగష్టు మధ్య కాలంలో ఈ పురుగు బాధ ఎక్కువగా ఉంటుంది.  రెక్క పురుగు నెల నుంచి  రెండు నెలల వరకు బతుకుతుంది.  మొత్తంగా 17 – 50 రోజుల లోపల జీవిత చక్రం పూర్తవుతుంది.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు  ఆకుల కింద భాగంలో ఉంటాయి. ఇవి పసుపు రంగులో గుంపులు గుంపులుగా కనపడతాయి. ఆకులపై నిలువునా అంటిపెట్టుకుని ఉన్నట్టు ఉంటాయి

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు చిన్నగా ఉన్నప్పుడు పసుపు రంగులు ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ క్రమేపి అది ముదురు పసుపు తెలుపు రంగులోకి మారుతుంది.  ముందు భాగం వెడల్పుగా  ఉంటుంది. వెనుక భాగం సన్నగా ఉంటుంది. శరీరం అంతటా చిన్న చిన్న ముళ్ళ  వంటివి ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
పూర్తిగా పెరిగిన పిల్ల పురుగుగు తన శరీరంలోని ఆఖరి భాగంతో ఆకును అంటిపెట్టుకుని ఉంటుంది. శరీరం నుంచి విడుదల ఆయ్యే ఒక రకమైన జిగట ఆసరాగా ఇలా అంటుకుని ఉంటుంది.

తల్లి పురుగు

తల్లి పురుగు చిన్న సైజులో గుండ్రంగా లేదా కొంచెం  చతురస్రాకారంగా ఉంటుంది.  5 మిల్లి మీటర్ల పొడవు, ౩.5 మిల్లి మీటర్ల వెడల్పు  ఉంటుంది. పురుగు శరీరం కింద భాగం  సమతలంగానూ, పై భాగం వంపు తిరిగి ఉంటుంది.  ఇది తేలికపాటి ఇటుక రంగు లేదా గులాబీ రంగులో ఉండి, పైన ఉండే రెక్కల పైన 12 – 28 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు అర్ధ  చంద్రాకారంలో, వరుసలుగా పేర్చబడి ఉంటాయి. 

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • పంట జాతికి చెందిన సేంద్రియ మిశ్రమాలు పనిచేస్తాయి.
  • నర్సరీ లేదా పెరిగిన్ మొక్కలపైన, లీటరు నీటికి ౩ మిల్లి లీటర్ల డి.డి.వి.పి 1 లేదా ౩ గ్రాముల కార్బారిల్ లేదా 2 మిల్లి లీటర్ల  ప్రోఫెనోఫాస్ లేదా 2 మిల్లి  లీటర్ల క్వినాల్ఫాస్ కలిపి చల్లాలి.  
  • జీవ పద్దతులు
  • మామూలుగా  ఉదయం సమయాల్లో పురుగులు మెల్లగా కదులుతూ ఉంటాయి. ఈ సమమయంలో చేతితో వాటిని ఏరివేయవచ్చు.
  • పంట విస్తీర్ణం తక్కువగా ఉంటే,  ఆకుల కింద ఉండే గుడ్ల గుంపును కూడా ఏరి నాశనం చేయవచ్చు.
  • మిత్ర పురుగులను ప్రోత్సహించడం - ఈ పురుగు గుడ్లను తినే (టెట్రా స్టికాస్ ఓవులేరం), పిల్ల పురుగుల్ని తినే   ఉగా మినోని వంటివి  మిత్ర  పురుగులు)
 

షూట్,  ఫ్రూట్ బోరర్

Scientific Name :   Leucinodes orbonalis   

వంకాయ, బంగాళ దుంప,  కాకర కాయ వంటి పంటలను ఆశిస్తుంది.

లక్షణాలు
దేశంలోని  అన్ని ప్రాంతాలలలోనూ  వంకాయ పంటను విపరీతంగా ఆశించే పురుగు ఇది. శాఖీయ ద దశలో పురుగు సోకితే,  పిల్ల పురుగులు మొక్క లోని ఆకులు, లేత కొమ్మలు వంటి లేత భాగాలన్నిటిని పాడుచేస్తాయి.  కాయ దశలో ఈ పిల్ల పురుగులు కాయను తొలుస్తాయి.  కాయలకు రంధ్రాలను చేసి వాటి లోపలి భాగాలని తింటూ బతుకుతాయి. తొలి దశలో ఈ రంధ్రం చిన్నగా,  కంటికి కనిపించనంతగా ఉంటుంది. రానురాను ఈ రంధ్రాలు గుండ్రంగా, పెద్దవిగా మారుతాయి.  రోగం సోకిన కాయ  తినడానికి పనికి రాదు.
పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే  వంకాయ పంట దాదాపు 70% దెబ్బతింటుంది. చలి కాలం తప్ప ఏడాది పొడవునా ఈ పురుగు సోకుతుంది. నర్సరీలో పురుగు సోకిన ప్రభావం ఏమి కనపడదు. నాటిన మొక్కలపై పురుగు దాడి చేస్తుంది. దానివల్ల  లేత మొక్క భాగాలు ఉబ్బుతాయి. శాఖీయ దశలో మొక్క ఎండిపోతుంది.  రోగం సోకిన కాయలపై రంధ్రాలు ఏర్పడి, వాటి దగ్గర పురుగు విసర్జితాలు కనపడతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు

కాయలు,  శాఖీయ భాగాలు 

పురుగు జీవిత చక్రం

గుడ్డు దశ :
తల్లి పురుగు ఒకేసారి 80 నుంచి 2౦0 గుడ్లు పెడుతుంది.  మొక్క లేత భాగాలపై ఇవి కనపడతాయి. ౩ – 5 రోజులలో గుడ్లు పొదగబడతాయి.

 పిల్ల పురుగు (లార్వా) దశ :

పిల్ల పురుగు 5 దశలలో రూపాంతరం చెందుతుంది.  ఈ దశ 11 – 1౩ రోజులలో పూర్తవుతుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను  కాండం మీద లేదా కాయ కాడల మీద ఉన్న రంధ్రాలలోనూ గడుపుతుంది.  ముదురు తెలుపు లేదా ముదురు గోధుమ రంగులో సిల్కు మాదిరిగా ఉంటుంది.  11 నుంచి 1౩ రోజుల పాటు గడుపుతుంది.  
తల్లి పురుగు
కోశాస్థ దశకు వెళ్ళిన తరువాత  6 – 8 రోజుల లోపల  రెక్కల  పురుగు బయటికి వస్తుంది.  ఆడ, మగ పురుగులు కలిసే దశ ఇది. అయితే ఈ దశలో పురుగు పంటకు  ఏ మాత్రం నష్టం చేయదు.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు స్పిండీల్ ఆకారంలో ఉంటాయి.  లేత పసుపు తెలుపు రంగులో ఉంటాయి.    

పిల్ల పురుగు (లార్వా) దశ :
పూర్తిగా పెరిగిన పిల్ల పురుగు గులాబి రంగులో ఉంటుంది. తల గోధుమ రంగులో ఉండి, శరీరం మీద చిన్న చిన్న మచ్చలు, అక్కడక్కడా సన్నని వెంట్రుకలు ఉంటాయి. మొత్తంగా 16 0 20 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.

కోశాస్థ దశ (ప్యుపా)

ఈ దశను కాయ, కాండం లేదా నేల లోపల  గోధుమ రంగులో ఉండే మెత్తటి గూడులో గడుపుతుంది.  ఈ దశలో పురుగు కూడా గోధుమ రంగులోనే ఉంటుంది. 

తల్లి పురుగు

తల్లి  పురుగు సైజు  మధ్యస్తంగా ఉంటుంది. తెల్లటి రెక్కలుంటాయి. వాటిపై పెద్ద సైజులో గోధుమ రంగు మచ్చలు,  ఎర్రటి గుర్తులు మాదిరి ఉంటాయి.  రెక్కల నిడివి ౩/4 అంగుళం మేర ఉంటుంది. తల, గొంతు భాగం నలుపు గోధుమ రంగులో ఉంటాయి.  

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • నాటిన ౩ వారాల తరువాత,  లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్, 2 మిల్లి లీటర్ల ప్రోఫెనోఫాస్, 1 మిల్లి లీటరు సైపెర్ మెత్రిన్ కలిపి చల్లాలి. మధ్యలో 10 రోజుల విరామంతో ౩ సార్లు ఇలా చేయాలి
    • కార్బారిల్ వాడినప్పుడు, అది రెండు సార్లు వాడిన తరువాత ఒకసారి అకారిసిదాల్ మందు చల్లాలి. లేకపోతే పురుగుల తీవ్రత నియంత్రించబడదు. .
  • జీవ పద్దతులు
    • రోగం వల్ల దెబ్బతిన్న పంట భాగాలను ఏరి నాశనం చెయ్యాలి.
    • వంకాయ, బంగాళ దుంపను అదే పనిగా వేస్తె పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనువైన రీతిలో పంటలను మారుస్తూ ఉండాలి.
    • రోగ నిరోధక వంగడాలను వాడాలి
    • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి.
    • సహజ  శత్రువులైన పురుగులను ప్రోత్సహించాలి. (ప్రిస్తో మీరాస్ టేస్టా క్యుస్,  త్రాతల ఫ్లావోర్బితాలిస్, మైక్రో బ్రాకాన్ గ్రీని, సుడో పెరిచీత వంటివి ఈ పురుగుకు సహజ శత్రువులు)
 

కాండం తొలిచే పురుగు
Scientific Name :   Euzophera perticella

వంకాయ, బంగాళ దుంప, టమాట తదితర పంటలను ఆశిస్తుంది.

లక్షణాలు
గుడ్లనుంచి బయటికి రాగానే పిల్ల పురుగులు మొక్క అడుగు భాగంలో  కాండాన్ని తొలుచుకుని లోపలికి పోతాయి. ప్రధానంగా కొమ్మలు వచ్చే చోట పురుగులు రంధ్రాలు చేస్తాయి. లోపలికి పోయిన తరువాత పై నుంచి రంధ్రాలను  తమ విసర్జితాలతో, ఇతర చెత్తతో కప్పేస్తాయి. పురుగు ఆకులు, కాయలకు ఏ మాత్రం  నష్టం చేయదు. కేవలం కాండాన్ని మాత్రమే పాడు చేస్తాయి. లేత మొక్కలు కాకుండా  కొంచెం పెరిగిన మొక్కలని మాత్రమే పాడు చేస్తాయి.
పురుగు సోకినప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. క్రమేపి మొక్క వడలి చివరకు పూర్తిగా ఎండిపోతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
కాండం

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగు లేత ఆకులు, కాడలు, లేత కొమ్మల  మీద  గుడ్లను విడివిడిగా కానీ, గుంపులుగా కానీ పెడుతుంది. 
 
పిల్ల పురుగు (లార్వా) దశ :
ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను బట్టి  పిల్ల పురుగు దశ నాలుగు నుంచి 8 వారాల వరకు ఉంటుంది.

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను కాండం లోపలే గడుపుతుంది.  ఈ దశలో 1 –  వారాల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
రెక్కల  పురుగు సైజు మధ్యస్తంగా ఉంటుంది.  ఈ దశలో ఆహారం తినడు. కేవలం పునరుత్పత్తి మాత్రమే జరిగే దశ ఇది.  
పురుగు మొత్తం జీవిత చక్రం ౩0 –  60 రోజుల లోపల పూర్తవుతుంది

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

లేత ఆకులు, కాడలు, లేత కొమ్మల  మీద  గుడ్లు విడివిడిగా కానీ, గుంపులుగా కానీ ఉంటాయి.  ౩ – 10 రోజుల లోపల  పొదగబడతాయి. 

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. శరీరం మీద సన్నటి వెంట్రుకలు ఉంటాయి. తల నారింజ గోధుమ లేదా ఎరుపు రంగులో ఉంటుంది.  పూర్తిగా పెరిగిన పిల్ల పురుగు 16 – 18 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.
కోశాస్థ దశ (ప్యుపా)
పిల్ల పురుగు కాండం లోనే ఆహారం కోసం ఏర్పరచుకున్న మార్గంలో లేదా నేలలోపల కోశాస్థ దశను గడుపుతుంది.

తల్లి పురుగు

రెక్కల పురుగు సైజు మధ్యస్తంగా ఉంటుంది.  ముందు రెక్కలు పాలిపోయినట్టు బూడిద గోధుమ రంగులో ఉంటాయి.  రెక్కల మధ్యన వెనుక భాగంలో దంతం ఆకారంలో నల్లటి గీతలు ఉంటాయి.  వెనుక రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి.
 
పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్ లేదా 1.6 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ కలిపి చల్లాలి
  • జీవ పద్దతులు
  • రోగం సోకిన మొక్కలను ఏరి నాశనం చెయ్యాలి.
  • అదే పంటను పదేపదే వేయకూడదు
  • సహజ శత్రువులను ప్రోత్సహించాలి ( ప్రిస్తో మీరాస్ యుజో ఫెరియా వాయేరిక్ వంటి పురుగులు)   
  • రసాయన మందులు వాడకుండా ఉంటే సహజ శత్రువులైన పురుగులు పెరుగుతాయి.
  • వేప పిండిని నేలలో చల్లితే పురుగు నియంత్రించబడుతుంది
  • తప్పనిసరిగా అవసరమైతే,  స్థానిక వ్యవసాయ విస్తరణ  అధికారుల సలహాలు తీసుకుని అవసరమైన మందులు చల్లాలి
 

మీలి బగ్స్

Scientific Name Centrococcus insolitus

అనేక పంటలను ఆశించే పురుగు ఇది.

లక్షణాలు

ఆకుల కింద భాగంలోనూ, లేత కొమ్మలు, కాండం మీద పురుగు సోకిన లక్షణాలు  కనపడతాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు  ఈ భాగాల నుంచి రసాన్ని పీలుస్తుంటాయి. దానివల్ల పురుగు సోకిన లేత కొమ్మలు, ఆకులు రంగు కోల్పోతాయి.  ఫలితంగా మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. కొమ్మలు ఎండి పోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, లేత కొమ్మలు, కాండం

పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఒక్కో ఆడ పురుగు 200 – ౩00 గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన 4 – 5 రోజులలో పురుగు తన  శరీరం కింద ఈ గుడ్లను పొదుగుతుంది.

పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగు మూడు రకాలుగా రూపాంతరం చెందుతుంది. 22 – 25 రోజులలో ఈ మూడు రూపాలను పూర్తి చేస్తుంది. గుడ్ల నుంచి బయటికి రాగానే పిల్ల పురుగులు చాలా చురుకుగా కదులుతూ ఉంటాయి.  అలా కదులుతూ చాలా దూరం వెళతాయి. పెరిగిన పిల్ల పురుగులు మాత్రం మొక్క భాగాలను అంటిపెట్టుకునే ఉంటాయి. 

కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
తల్లి పురుగు
మగ పురుగులు ఆడ పురుగులను కలవడానికి ఎగురుతూ ఉంటాయి.  అయితే ఈ రకపు పురుగుల జాతులలో చాలావాటిలో మగ పురుగులు ఉండవు.   ఇలాంటి వాటిలో మగ పురుగులతో కలవకుండానే ఆడ పురుగులు గుడ్లు పెడతాయి. వీటిలో కూడా కొన్నే పురుగులు గుడ్లు పెడితే, మరికొన్ని నేరుగా పిల్లలనే కంటాయి.  మామూలు పరిస్థితుల్లో ఈ పురుగు జీవిత చక్రాన్ని 26 – ౩0 రోజులలో పూర్తి చేసుకుంటుంది.

పురుగును గుర్తించడం
గుడ్డు దశ

గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి.  తల్లి పురుగు శరీరం కింద భాగంలోనే అంటుకుని ఉంటాయి. తెల్లటి, పట్టు లాంటి జిగట పదార్థం ఆసరాగా తల్లి శరీరానికి గుడ్లు అంటుకుని ఉంటాయి.

పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు కూడా చాలా చిన్నగా ఉంటాయి. సమతలంగా కానీ, బల్ల పరుపుగా కానీ ఉండి, పసుపు రంగులో కనపడతాయి.  కొన్ని జాతులకు చెందిన పిల్ల పురుగులు పెద్దవిగా మారిన తరువాత వాటికి పైన తెల్లటి మైనంతొ పాటు ఈకల వంటివి ఉంటాయి. పెద్దవిగా మారిన లార్వాలు తల్లి పురుగుల  మాదిరిగానే  ఉంటాయి.  పెద్దవైన మగ లార్వాలు చిన్నటి  ఈకలతో కూడిన గూడు ఆకారంలో ఒక ద్రవాన్ని కారుస్తూ ఉంటాయి. రానురాను ఇవే రెక్కలుగా మారుతాయి.

కోశాస్థ దశ (ప్యుపా)
           ఈ దశ ఉండదు.

తల్లి పురుగు

తల్లి పురుగు శరీరం చాలా మృదువుగా, పొడవుగా, గుండ్రంగా  ఉంటుంది.  కాళ్ళు స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటాయి.  ఇవి ౩ – 5 మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటాయి.  శరీరం నుంచి మైనం వంటి పదార్ధం కారుతూ ఉంటుంది. ఇది క్రమేపి ముందు, వెనుక పోగులుగా మారుతాయి. మామూలుగా రెక్కలు ఉండవు.  కదిలిస్తే గానీ కదలవు. వెనుక కొమ్మలు, ఆకులు, కాయల వద్ద గుంపులు గుంపులుగా ఉంటాయి.  కొద్ది కాలం మాత్రమే జీవించే మగ పురుగులు ౩ మిల్లి మీటర్ల మేర పొడవు ఉంటాయి.  మగ పురుగులకు ఒక జత రెక్కలు ఉంటాయి.  కళ్ళు చాలా ఉంటాయి.  అయితే నోటి భాగాలు మాత్రం  ఉండవు.

పురుగు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు

లీటరు నీటికి 1 మిల్లి లీటరు డి.డి.వి.పి. లేదా 2 మిల్లి లీటర్ల మాలాథియాన్ మందును చల్లాలి.

  • జీవ పద్దతులు
    • పంట అవశేషాలను తొలగించి, వాటిని కాల్చి వేయాలి.  ఇలా చేస్తే తెగులు వ్యాపించదు.
 

డ్యాంపింగ్ ఆఫ్

ఇది పైథియం ఎస్.పి.ఎస్ లేదా ఫైటోఫ్తోరా ఎస్.పి.ఎస్ లేదా రైజాక్తినియా ఎస్.పి.ఎస్. అనే ఫంగస్ వల్ల వస్తుంది.  వంకాయ,  బెండ, అనేక ఇతర కూరగాయల పంటలను ఆశిస్తుంది.   

లక్షణాలు

ఈ తెగులు నర్సరీలో ఎక్కువ నష్టం కల్గిస్తుంది.  ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనపడతాయి. మొలక రాక ముందు అయితే,  నేలలోనే విత్తనం, మొలక  కుళ్ళిపోయి చనిపోతాయి. మొలక నేల నుంచి బయటకు రాదు. మొలక వచ్చిన తరువాత దశలో తెగులు సోకితే,  మొలక అడుగు భాగంలోని లేత కణజాలం దెబ్బ తింటుంది. మెత్తగా , మృదువుగా మారి, నీటిలో తడిసినట్లు ఉంటుంది.  క్రమేపి ఆ భాగం కుళ్లిపోయి, మొలక నిలబడలేక పడిపోతుంది. చివరకు  చనిపోతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
మొలకలు
తెగులు జీవిత చక్రం
మొక్క మొలక దశలో వచ్చే తీవ్రమైన తెగులు ఇది.  ఈ తెగులు రెండు దశలుగా వస్తుంది - విత్తనం మొలకెత్తక ముందు.  మొలకెత్తిన తరువాత.   విత్తనం మొలకెత్తక ముందు ఈ తెగులు వస్స్తే మొలక  నేలలోంచి కూడా బయటికి రాదు. లోపలే చచ్చిపోతుంది.  నీళ్ళు ఎక్కువగా పెట్టడం, శుద్ధి చేయని మట్టిలో విత్తనాలు పెట్టడం,  విత్తనాలు నాటిన ట్రేల మీద మూతలు చాలా కాలం పెట్టి ఉంచడం వంటి కారణాల వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. 

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • విత్తఃన  శుద్ధి  -  నాటే ముందు కిలో విత్తనాలకు 2 గ్రాముల థైరాం కలిపి విత్థనాలని శుద్ధి చేయాలి.
    •  నర్సరిలో వాడే మట్టికి కూడా  థైరాం (2 మీటర్ల మట్టికి 5 గ్రాములు)  కలపాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి లీటరు నీటికి 2 గ్రాముల థైరాం కలిపి మట్టిపై చల్లాలి.  
    • నర్సరీ బెడ్డు మీద నాటడానికి ముందు ౩0 రోజుల పాటు 250 గేజు పాలిథీన్ షీట్  కప్పి ఉంచాలి.
    • హెక్టారుకు 1.2 కిలోల ట్రైకోడేర్మా విరిడి మందు చల్లడం కూడా తెగులు నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుంది.
  • జీవ పద్దతులు
    • ఆరోగ్యకరమైన విత్తఃనాలను నాటాలి. 
    •  ఒకే ప్లాటులో పదేపదే నర్సరీ పెంచడం మంచి పద్ధతి కాదు.

అనుకూల వాతావరణం

ఎక్కువ మట్టి, తేమ, సగటు ఉష్ణోగ్రత ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటు వానాకాలంలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు తెగులు తొందరగా వ్యాపిస్తుంది
 

సేర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

ఇది సేర్కో స్పోరా మేలాంజినే అనే ఫంగస్ వల్ల వస్తుంది.   వంకాయతో పాటు ఇతర కూర గాయల పంటలు కూడా ఆశిస్తుంది.

లక్షణాలు

ఆకుల మీద మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఒక పద్ధతి లేకుండా లేదా రక రకాల ఆకృతిలో ఈ మచ్చలు ఉంటాయి. క్రమేపి ఇవి  బూడిద – గోధుమ రంగుకు మారుతాయి.  తెగులు ఎక్కువగా సోకిన ఆకులు తొందరగా రాలిపోతాయి. దానివల్ల కాయ ఏర్పడదు.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు

తెగులు జీవిత చక్రం
ఈ తెగులును వ్యాపింప చేసే ఫంగస్ కణాలు వాన, సాగు నీరు, గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. చలికాలపు ఆఖరి రోజులు లేదా వేసవి ప్రారంభంలో తేమ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో జీవ కణాలు అభివృద్ధి చెందుతాయి. తడిగా ఉండే ఆకులు తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. చలి కాలం నాటికి మొక్క ఎదిగితే తెగులు తీవ్రతను తట్టుకుంటుంది. మామూలుగా చెప్పాలంటే, వానలు ఎంత ఎక్కువగా ఉంటే, తెగులు వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుంది.  పంట అవశేషాలలో దాక్కుని ఉండే ఫంగస్ జీవ కణాలు నాటిన విత్తనాలను పాడు చేస్తాయి.   
ప్రధానంగా ఈ తెగులు నేల ద్వారా, విత్తనాల ద్వారానే వ్యాపిస్తుంది. తెగులు సోకినప్పుడు కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
    • లీటరు నీటికి2 గ్రాముల క్లోరోతలోనిల్ లేదా బవిస్టీన్ (0.1%) కలిపి తెగులు సోకిన మొక్కలపై చల్లాలి.
  • జీవ పద్దతులు
      • పంటల మార్పిడి
      • వేడి నీటితో విత్తన శుద్ధి
      • తెగులు నిరోధక విత్తనాలు, వంగడాలు వాడడం
      • మొక్కల మధ్య సరైన దూరం పాటించడం
      • పొలంలో సరైన రీతిలో పారిశుధ్యం పాటించడం
      • తెగులు సోకిన మొక్కలను తీసిపారేయడం - తెగులు సోకిన కణజాలాన్ని ఏరి కాల్చివేయడం
      •  మొక్క తడిగా ఉన్నప్పుడు పొలంలో పని చేయకుండా ఉండడం

అనుకూల వాతావరణం
ఈ కింద తెలిపిన పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం

  • వేడి వాతావరణం, తరచుగా వానలు పడడం, అధిక తేమ ఉన్న వాతావారణ పరిస్థితులు
  • మొక్కలు దగ్గర దగ్గరగా ఉండి, వాటి మధ్య సరైన రీతిలో గాలి, వెలుతురు ప్రసరించకుండా ఉన్న పరిస్థితులు
  • పోషకాలు, సాగునీటి నిర్వహణ సరిగా లేని పరిస్థితులు
  • పొలంలో మురుగు నీరు పోయే సౌకర్యం సరిగా లేని పరిస్థితులు
 

ఆల్టర్నేరియ ఆకుమచ్చ తెగులు
ఇది ఆల్టర్నేరియా మేలాంజినే అనే ఫంగస్ వల్ల వస్తుంది.  వంకాయతో పాటు ఇతర కూర గాయల పంటలు కూడా ఆశిస్తుంది.

లక్షణాలు
ఆకుల మీద ప్రత్యేకమైన వలయాకారపు  మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒక పద్దతిలో ఉండవు.  మచ్చలు కలిసిపోయి పెద్ద మచ్చలు కూడా ఏర్పడతాయి. ఆకుల అంచుల వెంబడి ఇవి కనపడుతాయి. తెగులు సోకిన కాయల మీద లోతైన రంధ్రాల వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కాయలు పసుపు రంగులోకి మారుతాయి. తొందరగా రాలిపోతాయి.

మొక్కలో  పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు

తెగులు జీవిత చక్రం
చలి కాలంలో ఫంగస్ పంట అవశేషాల కింద ఉంటుంది. పరిస్థితులు అనుకూలించగానే ఇది జీవ కణాలను విడుదల చేస్తుంది. ఈ జీవ కణాలు నీటి ద్వారా లేదా గాలి ద్వారా వేరే మొక్క దగ్గరికి చేరతాయి.  మొక్కలోని లేత భాగాలలో చిన్న చిన్న గాయాలు లేదా రంధ్రాలు చేయడం లేదా నేరుగా కాడలోకి చొచ్చుకుపోవడం ద్వారా మొక్కలోనికి పోతాయి.  తొలుత నెలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది.   జీవ కణాలు పెరిగి తెగులు మచ్చలుగా కనపడడానికి కొంత సమయం తీసుకుంటాయి.  ఈ మచ్చలున్న చోటునుంచే మరిన్న్హి జీవ కణాలు విడుదల అవుతాయి. ఇలా తెగులు అ మొక్కలోని ఇతర భాగాలకు లేదా ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.  మొక్కలోని అన్ని భాగాలకు ఈ తెగులు సోకుతుంది.  కాయలకు, వేర్ల భాగాలకు తెగులు సోకినప్పుడు ఇది ఇంకా త్వరితంగా వ్యాపిస్తుంది.  పంటలో ఉన్న కలుపు, దగ్గరగా ఉన్న ఇతర ఆతిధేయ పంటలను బట్టి కూడా తెగులు వ్యాప్తి ఉంటుంది. ఎదిగిన మొక్కలలో తెగులు తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది.  

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • రసాయన పద్దతులు
  • తెగులు సోకిన మొక్కలపై బవిస్టిన్ (0.1%) మందు చల్లాలి 
  • జీవ పద్దతులు
    • తెగులు సోకిన మొక్కలను, వాటి భాగాలను ఏరి పారెయ్యాలి.

అనుకూల వాతావరణం

అక్టోబర్ ఆఖరి రోజుల నుంచి నవంబర్ తొలి వారం మధ్య కాలంలో ఈ తెగులు ప్రారంభమవుతుంది. అయితే  నవంబర్ – డిసెంబర్ మధ్య కాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా తెగులు పెరుగుతుంది.  తరచుగా పడే వానలు, వాతావరణంలో ఎక్కువ తేమ ఉన్న పరిస్థితుల్లో తెగులు వృద్ధి చెందుతుంది.  

 

ఫ్రూట్ రాట్ - కాయ కుళ్ళు తెగులు
ఇది ఫైటోఫ్తోరా నికోటియానే  అనే ఫంగస్ వల్ల వస్తుంది.

లక్షణాలు
తొలుత కాయల మీద తడి మచ్చలు వంటివి కనపడుతాయి.  రాను రాను వీటి సైజు పెరుగుతుంది.  కాయ పై పొర గోధుమ రంగుకు మారుతుంది. దాని మీద తెల్లటి దూది వంటి బూజు ఏర్పడుతుంది.

మొక్కలో  పాడయ్యే భాగాలు
కాయలు          
తెగులు జీవిత చక్రం
తెగులు సోకిన మొక్క కణజాలం మీదనే ఫంగస్ జీవ కణాలను విడుదల చేస్తుంది.  ఇవి నీటి ద్వారా మొక్కలోని ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది. అదే క్రమంలో మొక్కలోని ఆరోగ్యకరమైన ఆకులకు కూడా సోకుతుంది.  జీవ కణాలు జేర్మ్ ట్యూబ్ ల ద్వారా మొక్కలోని ఆయా భాగాలలోనికి తెగులు సోకుతుంది. ఇది పెరుగుతున్న కొద్దీ తెగులు లక్షణాలు, ఆయా భాగాలు కుళ్ళిపోవడం స్పష్టంగా కనపడుతాయి. 
తెగులు సోకిన ఆకులు, కాడలు ఎండి రాలిపోతాయి. మొక్క కణజాలం కుళ్ళిపోతుంది.  చివరకు మొక్క ఎండి పడిపోతుంది. తెగులు సోకిన మొక్క భాగాలు లేదా అది ఉన్న మట్టి ద్వారా ఇది చాలా దూరం వ్యాపిస్తుంది.

తెగులు నియంత్రణ నివారణ  పద్దతులు

  • జీవ పద్దతులు
    • తెగులు సోకిన కాయలు ఏరి నాశనం చేయాలి.
    • దిఫోలతాన్ (0.౩%) మందును 10 రోజుల విరామంతో మూడు సార్లు చల్లాలి. 

అనుకూల వాతావరణం
ఎక్కువ తేమ ఉన్న పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.