తుప్పు తెగులు
ఆకులఫై, కాయలఫై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలు కోతకు తయారు కాక ముందే రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోధలోనిల్ లేదా 2.5 గ్రాముల మంకోజోబ్ కలిపి పిచికారి చేయాలి.
నల్ల మచ్చలు
కాయలఫై గోధుమ రంగు నీటి బుడగల మాదిరి బొడిపెలు ఏర్పడతాయి. రాను రాను ఇవి పెద్దవవుతాయి. దిని నివారణకు లీటరు నీటికి ౩ గ్రాముల కాపర్ అక్సిక్లోరైడ్ లేదా 1 శాతం బోర్డ్ మిశ్రమం చల్లాలి. తొలకరి వర్షాలు పడగానే కాయ పెరుగుదల ఆరంభమైన దశలో 15 రోజుల వ్యవధిలో బాగా తడిచేలా రెండుసార్లు పిచికారి చేయాలి.
కాయకుళ్ళు తెగులు
కాయల ఫై గోధుమ రంగుతో నీటి బూడగల లాగా వుంది పెద్దవైనకొలది నీటి ఆకుపచ్చ రంగులోకి మారి పసుపు వర్ణంలో నున్న ద్రవపు చుక్కలు కనిపిస్తాయి. కాయల నుంచి చెడువాసన వస్తుంది. దీని నివారణకు కాయలను నిల్వ చేసేటప్పుడు 1 శాతం బోరాక్స్ (1౦గ్రా.ల బోరాక్స్ లీటరు నీటిలో కలిపి ) లేదా 2 శాతం ఉప్పు ద్రావణంలో ముంచి తీయాలి.
పండ్లపై మచ్చలు
గోధుమ రంగులో మొదలై నలుపు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ తెగులు సాధారణంగా బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 6 గ్రాముల బోరాక్స్ మందు కలిపిన ద్రావణాన్ని కాయలు పెరిగే దశలో ౩ దఫాలుగా 15 రోజుల వ్యవదితో పిచికారి చేయాలి. |