పురుగులు / తెగుళ్ళు
సీతాఫలంపై పురుగులు, తెగుళ్ళు ఎక్కువ ఆశించవు. కేవలం పిండి పురుగులు మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి.  రాతి కాయలు కూడా ఏర్పడతాయి.

పిండి పురుగులు
ఈ పిండి పురుగులు కాయల పైకాళ్ళ మధ్య గుంపులు గుంపులుగా చేరి కాయ నుంచి రసం పీల్ఛి జీవిస్తూ అభివృద్ధి చెందుతాయి. ఇవి విసరిజించిన తియ్యటి పదార్ధం ఆకులపై పది సిలిద్రం పెరగడం వలన నల్లని మసి ఏర్పడుతుంది. ఈ పురుగు వల్ల కాయ లోపల నాణ్యతలో ఏ విధమైన మార్పులు లేనప్పటికీ పైన పురుగులు వుండడం వల్ల అసహ్యంగా  వుంది తినడానికి అనువుగా వుండవు. వీటి నివారణకు ఎండాకాలంలో పాదులను తవ్వాలి. చెట్ల మొదళ్లకు 4౦౦ గేజ్ అల్కత్తినన్ షీట్ నవంబర్ – డిసెంబర్  మాసాల్లో ఒక అడుగు వరకు కట్టాలి. పిండి పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి ఒక మీ.లి. దైచ్లోరోవాస్ లేదా 2 మీ.లి. మిథైల్ పెరధీయాన్ లేదా 2.5 మి.లి. క్లోరిపైరిఫాస్ లేదా 2 మీ.లి. ఎండోసల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి. కాయలపై  ఎక్కువ సంఖ్యలో పిండి పురుగులు ఉంటే కాయలను తెంచి నాశనం చేయాలి. కాయలు కోత దశలో వున్నప్పుడు  క్రిమి సంహారక మందులు పిచికారి చేయరాదు. క్రిప్టో లిమాస్ మాం ట్రోజరి అను పరాన్నజీవులను చెట్లపై వదాలాలి.


రాతి కాయలు
సితాఫలం కాయల్లో కొన్ని కాయలు పూర్తిగా అభివృద్ధి చెంది పక్వానికి రాకముందే గట్టిగా మారి ఎండిపోతాయి. కాయలు నల్లగా మారతాయి. ఇవి చెట్టు నుండి రాలిపోకుండా చాలాకాలం వరకు చెట్టులో కొమ్మలకు వేలాడుతూ వుంటాయి. వీటిని రాతికాయలు అంటారు. వీటి నివారణకు నెలల్లో  తగినంత తేమను కల్పించాలి. పోషక పదార్ధాల లోపం వల్ల ఈ విధమైన కాయలు ఏర్పడతాయి. అలాంటప్పుడు తగిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి.

అకుమచ్చ తెగులు
ఆకులపై నల్లటి ఏర్పడి నష్టాన్ని  కలుగ చేస్తాయి.  దీని నివారణకు కార్బండైజిం 1 గ్రా. లీటరు నీటికి పిచికారి చేయాలి.