మొగ్గతొలిచే పురుగు :
పిల్ల పురుగులు లేత గులాబీ రంగులో ఉంటాయి. ఇవి లేత పూమొగ్గలను  తొలచి తినివేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఆశిస్తుంది.

ఆకుగూడు అల్లే పురుగు :
జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఉదృతి కనపడుతుంది. పిల్ల పురుగులు లేత, ముదుర ఆకులను గూళ్ళుగా చేడుకుని ఆకులను తినడం, గోకడం వంటివి చేస్తాయి. ఈ విధంగా లేత చిగురు, పూతకు హాని చేస్తాయి. ఈ పురుగులు అప్పుడప్పుడు కాయలకు కూడా హాని చేస్తుంది. .

కాయను తొలిచే పురుగు :
ఈ పురుగు సాధారణంగా సరైన యాజమాన్య పద్ధతులను పాటించి తోటలో వస్తుంది. పురుగులు కండ ద్వార గింజను చేరుకొని గింజను తింటాయి. దీనివల్ల కండ పాడవక పోయినా,  కొనే వారిలో అయిష్టత ఏర్పడుతుంది.

పై పురుగులను నిర్మూలించడానికి లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎండోసల్పాన్ లేదా 1.6 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ లేదా ౩ గ్రాముల కార్బారిల్ కలిపి ఆకులు, చిగుళ్లు, కొమ్మలు పూర్తిగా తడిసేలా  పిచికారి చేయాలి. ఈ మందులను అవసరాన్ని బట్టి మారుస్తూ వాడుకోవాలి.  తోటలో కలుపు లేకుండా శుభ్రత పాటిస్తే చాల వరకు చీడలను ఆరికట్టవచ్చు.

 

ఆకుపచ్చ తెగులు:
ఈ తెగులు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు తేమ అధికంగా ఉండే సందర్బాలలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న, వలయాకారపు మచ్చలు తెల్లని మధ్యబాగం, గులాబీరంగు లేదా ఎరుపు గోధుమ రంగు అంచులతో ఏర్పడతాయి. మచ్చలు ఆకులకు రెండువైపులా ఏర్పడతాయి. మచ్చలు ఎక్కువగా ఏర్పడినపుడు ఆకులు రాలి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు ౩.౦ గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 

చెక్క తెగులు లేదా ఫ్లాట్ లించ్ :
తెగులు సోకిన కొమ్మలు వెడల్పుగా మారి సర్పాకృతిలో ఉంటాయి. ఆకులు సన్నగా, పసుపు రంగులో గుబురుగా కనిపిస్తాయి. కాయలు చిన్నవిగా ఉండగానే ఎండిపోతాయితెగులు తీవ్రదశలో ఆకులు రాలుతాయి. కొమ్మలు ఎండిన చెక్కలాగా కనబడతాయి.  నివారణకు గాను తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి, లీటరు నీటికి ౩ గ్రాముల  కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజేబ్ కలిపి పిచికారి చేయాలి.