పత్తి - ఆశించే పురుగులు
Cotton – Pests
పొగాకు లద్దె పురుగు
(Scientific Name Spdoptera Litura)
పొగాకు లద్దె పురుగు ప్రధానంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలం వరకు పురుగుకు సానుకూల వాతావరణం. దాదాపు 120 పంట జాతులను ఆశిస్తుంది. ప్రధానంగా టమాట, ఆముదం, పత్తి, క్యాబేజీ, వేరు శెనగ, జొన్న, మొక్క జొన్న, వంకాయ వంటి పంటలకు ఆశిస్తుంది.
లక్షణాలు
పత్తిలో ఎక్కువగా ఈ పురుగు ఆకులపైనే దాడి చేస్తుంది. ఆకుల మీద రంధ్రాలను చేస్తుంది. ఈ రంధ్రాల నుంచి పసుపు నుంచి ముదురు ఆకుపచ్చ రంగులో పురుగు విసర్జితం కారుతూ ఉంటుంది. పంట మీద పురుగు లార్వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆకులు వడలి రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులతో పాటు, పువ్వులను, పండ్లను, మొక్కలోని ఇతర లేత భాగాలను కూడా తినేస్తుంది.
పురుగు జీవిత చక్రం
ఈ పురుగు మొత్తం జీవిత కాలం 30- 40 రోజుల పాటు ఉంటుంది
గుడ్లు:
ఆడ పురుగు ఒక్కోసారి ౩౦౦ నుంచి 5౦౦ వరకు గుడ్లు పెడుతుంది. గుడ్డు 4-7 మిల్లి మీటర్ల సైజులో ఉంటుంది. kreem క్రీం కలర్ లేదా బంగారు గోధుమ రంగులో ఉంటాయి. ఆకుల కింది భాగంలో గుడ్ల సమూహం ఉంటుంది. ఈ గుడ్ల సమూహంపైన సన్నని వెంట్రుకల మాదిరి ఉంటాయి. మాములుగా 4-5 రోజులలో గుడ్లు పొదగబడతాయి. |
 |
 |
లార్వా (పిల్ల పురుగులు):
పిల్ల పురుగు లేత ఆకుపచ్చలో ఉంటుంది. గొంతు దగ్గర ముదురుగ కనపడుతుంది. పల్చటి చర్మంపైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గీతలు, తల వెనుక భాగంలో నల్లటి మచ్చ ఉంటాయి. ఆకును చివరలు మాత్రం మిగిలేల తొలుచుకుని తింటూ జల్లెడలా చేస్తుంది. ఆ విధంగా ఆకు మీద ఉన్న పచ్చదనం అంతా తినేస్తుంది. ఇలా జల్లేడ మాదిరిగా తయారైన ఆకులను చూసి రైతు పంటకు పురుగు పట్టిందని తెలుసుకోవచ్చు. పిల్ల పురుగు పెరుగుతున్న కొద్దీ ఆకులతో పాటు, పువ్వులను, పండ్లను, మొక్కలోని ఇతర లేత భాగాలను కూడా తినేస్తుంది. లార్వాల ఉధృతి ఎక్కువైనప్పుడు, మొక్క వడలి పోయినట్టు కనపడుతుంది.
మామూలుగా పిల్ల పురుగులు రాత్రి పూట ఎక్కువగా ఆకులను తిని మొక్కను నాశనం చేస్తాయి. రోజంతా మొక్క అడుగుభాగంలో ఉన్న చెత్తలో కానీ, నేలలో కానీ దాగి ఉంటాయి. సీజను,ఆహార లభ్యత బట్టి ఈ దశలో దాదాపు 20-౩౦ రోజుల పాటు ఉంటాయి. |
 |
ప్యూపా (కోశస్థ) దశ:
ఈ దశలో నేలలో కొన్ని సెంటి మీటర్ల పాటు చొచ్చుకునిపోయి అక్కడే నిద్రావస్థలో ఉంటాయి. పైన ఎటువంటి పెంకు ఉండదు. ఈ దశలో ఉన్నప్పుడు వాటినుంచి ఎక్కువ మొత్తంలో ద్రవం కారుతూ ఉంటుంది. పరిస్త్తితులు అనుకూలంగా ఉంటే వారం రోజుల లోపల బయటకు వస్తుంది. లేకుంటే నెలల పాటు అక్కడే ఉంటుంది. |
పెద్ద (రెక్కల) పురుగు:
గోధుమ రంగులో ఉంటుంది., తీర్చిదిద్దిన ఆకారంలో రెక్కల్ని (ప్రత్యేకించి రెక్కల చివరి భాగాలు) కలిగి ఉంటుంది. 5-1- రోజుల పాటు బతుకుతుంది. ఈ దశలోనే గుడ్లను పెడుతుంది. |
 |
పురుగును గుర్తించడం
లార్వా దశలో ఆకుల మీద గుంపులు గుంపులుగా కనపడతాయి. మొదట్లో విడివిడిగా కూడా ఉంటాయి. కొంచెం పెరిగిన తరువాత లార్వాల కింది భాగంలోనూ, పక్క భాగంలోనూ ముదురు గోధుమ రంగులో మచ్చలు కనపడతాయి. లార్వాలు పెరిగిన కొద్ది ఈ మచ్చలు స్పష్టంగా కనపడతాయి. లార్వాలు గుంపులు గుంపులుగా కదులుతూ ఉంటాయి. రాత్రి పూట మొక్క అడుగు భాగంలో నివాసముంటాయి.
ప్యూపా దశలో పురుగును గుర్తుపట్టడం కష్టం. ఈ దశలో ముదురు గోధుమ లేదా మెరిసే ఎరుపు రంగులో ఉంటాయి. నేలలో బొరియలు చేసుకుని వారం నుంచి కొన్ని వారాల పాటు వాటిలో ఉంటాయి. పైనే పెంకు ఉండదు.
రెక్కల పురుగులు రాత్రి పూట సంచరిస్తాయి. తీర్చిదిద్దిన రీతిలో రెక్కలను కలిగి ఉంటాయి.
అనుకూల వాతావరణం
ఖరీఫ్ సీజన్లో వానలు పడిన తరువాత ఉండే, చల్లటి, తేమతో కూడిన వాతావరణంలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలం వరకు పురుగుకు సానుకూల వాతావరణం. ఒక పంట మీద పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, వెంటనే ఇతర పంటల మీదకు పోతుంది కనుక, పురుగు జీవిత చక్రంలో ఎటువంటి ఆటంకం ఉండదు.
నియంత్రణ – నివారణ పద్దతులు
రసాయన పద్దతులు
లింగాకర్షక బుట్టలో ఒక వారం రోజుల లోపుల 100 కన్నా ఎక్కువ పురుగులు పడినప్పుడు కానీ, లేదా, పది మొక్కలలో ఒకటి లేదా రెండు గుడ్ల సమూహం కనపడినప్పుడు కానీ, లేదా మొక్కలలో 25 శాతం వడలిపోయినట్లు కనపడినా కానీ, వెంటనే మందులు వాడాలి.
- క్లోరో ఫైరిఫాస్ లేదా మొనోక్రోటోఫాస్ చల్లి లార్వాల వ్యాప్తిని నియంత్రించవచ్చు.
- రైస్ బ్రాన్, బెల్లం, మొనోక్రోటోఫాస్ లను కలిపిన మందు గుళికలను వాడి కానీ పెరిగిన లార్వాలను అరికట్టవచ్చు.
- జీవ పద్దతులు
- రెక్కల పురుగుల్ని ఆకర్షించే లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉధృతిని గమనించాలి.
- 5 శాతం ఎన్.ఎస్.కే.ఇ. ద్రావణం లేదా వైతెక్స్ లేదా కరంజ్ ద్రావణం చల్లి తొలి దశలో ఉన్న పిల్ల పురుగులను చంపవచ్చు. మిరప, వెల్లుల్లి ద్రావణం చల్లి పెరిగిన పిల్ల పురుగులను నియంత్రించవచ్చు.
- ముదిరిన లార్వాలను చంపడానికి ఎన్. పి.వి. లేదా బి.టి. సొల్యూషన్ చల్లవచ్చు.
- ఏర పంటలుగా ఆముదం వేయాలి.
- రైస్ బ్రాన్, బెల్లం కలిపిన మందు గుళికలను వాడి రాత్రి పూట లార్వాలను నియంత్రించవచ్చు.
- ఆకుల కింద ఉన్న లార్వాలను గుర్తించి, ఏరి చంపివేయాలి
- సహజ శత్రువులైన మిత్ర పురుగులను, పక్షులు పంట మీదకు వచ్చేలా చేయాలి.
|
| |
 |
|
(Scientific Name Helicoverpa armigera)
శనగ పచ్చ పురుగు ఖరీఫ్ లో, ఆగస్టు – అక్టోబర్ మధ్య కాలంలో వచ్చే పంటను ఆశించే పురుగు. అకాల భారీ వర్షాలు పడినప్పుడు, తేమ 70 శాతం వరకు ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పత్తి, కంది, జొన్న, శనగ, టమాట, బెండ, బీన్స్, బొబ్బర్లు వంటి పంటలను కూడా ఆశిస్తుంది.
లక్షణాలు
- కాయ మీద గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి.
- లార్వా దశలో పిల్ల పురుగు తల మాత్రం కాయలోకి తొలుచుకుని పోతుంది. మిగతా శరీరం మాత్రం బయటే ఉంటుంది. తొలవగా ఏర్పడిన రంధ్రాల దగ్గర గుళికల మాదిరిగా పురుగు విసర్జితాలు కనపడతాయి.
- ఒక్కొక్క లార్వా కనీసం 30 నుంచి 40 కాయలు పాడుచేస్తుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయ, ఆకులు, మొగ్గలు, పువ్వులు
పురుగు జీవిత చక్రం
మొత్తం జీవిత చక్రం 40రోజులపాటుఉంటుంద |
 |
గుడ్లు:
విడివిడిగా గుడ్లు లేత ఆకులు, పూ మొగ్గలతో పాటు, మొక్కలోని ఆయా భాగాల పై భాగం, కింది భాగంలోనూ కనపడతాయి. ఒక ఆడ పురుగు 5౦౦ గుడ్ల వరకు పెడుతుంది. ఇవి తెలుపు నుంచి ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటాయి. గసాల సైజులో ఉంటాయి. 4-5 రోజులలో పొదగబడతాయి. |
లార్వా (పిల్ల పురుగులు) :
సీజన్ , ఆహార లభ్యత బట్టి 14 నుంచి 20 రోజులపాటు ఈ దశలో ఉంటాయి. ఎక్కువగా పువ్వులను, మొగ్గలను ఇష్టపడుతుంది. ఆకులు కూడా తింటుంది. |
 |
 |
ప్యుపా (కోశస్థ) దశ:
ఈ దశలో నేలలో కాని, మొక్క మొదలులోని చెత్తలో కాని గడుపుతుంది. 10 నుంచి 15 రోజుల పాటు ఈ దశలో ఉంటుంది. |
తల్లి పురుగు:
ఈ దశలో ఆహారం తినదు. 6 నుంచి 8 రోజులపాటు ఈ దశలో ఉంటుంది. ఆడ పురుగుతో కలిసిన తరువాత గుడ్లు పెడుతుంది. |
 |
పురుగును గుర్తించడం
గుడ్లు:
విడివిడిగా మొక్కలోని ఆయా భాగాల పై భాగం, కింది భాగంలోనూ కనపడతాయి. తెలుపు నుంచి ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటాయి. గసాల సైజులో ఉంటాయి. 4-5 రోజులలో పొదగబడతాయి.
లార్వా (పిల్ల పురుగులు) :
పెరిగే తీరు, ఆశించిన పంటను బట్టి లార్వాలు ముదురు ఆకుపచ్చ, పసుపు, గులాబీ, నారింజ, గోధుమ, నలుపు రంగులో ఉంటాయి. రంగు ఏదైనా లేత రంగులోనే ఉంటాయి. శరీరం మీద సన్నని నూలు వంటి రోమాలు పలుచగా ఉంటాయి. పగటి పూట సులభంగా గుర్తించవచ్చు.
చిన్నవిగా ఉన్నప్పుడు ఆకులను గీకి గీకి తింటాయి. పెరిగే క్రమంలో కాయలు, మొగ్గలు, పువ్వులను తొలుచుకుని తింటాయి. అలా తొలిచిన చోట గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాల దగ్గర వాటి విసర్జితం ఉంటుంది.
ప్యుపా (కోశస్థ) దశ:
ముదురు గోధుమ రంగులో ఉంటుంది. నేలలో కాని, మొక్క మొదలులోని చెత్తలో కాని గడుపుతుంది
తల్లి పురుగు:
ఆడ పురుగు ముందు రెక్కలు పసుపు నుంచి నారింజ రంగులో ఉంటాయి. మగ పురుగులో ఇవి ఆకుపచ్చ నుంచి మసక గోధుమ రంగులో కనపడతాయి. రెక్కల అంచుల వెంబడి నల్లటి చారలు ఉంటాయి. వెనుక రెక్కలు లేత పసుపులో ఉండి, అంచుల పైన గోధుమ రంగు చారలు, మధ్యలో గుండ్రటి మచ్చలు ఉంటాయి.
అనుకూల వాతావరణం
అకాల వానలు పడినప్పుడు, తేమ 70 శాతం ఉన్నప్పుడు పురుగుకు అనుకూలం
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
ఒక హెక్టారుకు 2.5 లీటర్ల ఫోసలోన్ ౩5 ఇ.సి., లేదా క్వినాల్ఫోస్ 25 ఇ.సి., లేదా 2.5 కిలోల కార్బారిల్ 50 డబ్ల్యు.పి. లేదా 1.5 లీటర్ల పైరక్లోఫోస్ 50 ఇ.సి. వంటి పురుగు మందులను చల్లాలి.
- జీవ పద్దతులు
- పంటల మార్పిడి (పెసర్లు, మినుములు, సోయాబీన్, ఆముదం, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా వేయడం)
- ఎర పంటలుగా బంతి, బెండ వంటి పంటలు
- పంట అవశేషాలను తొలగించడం
- నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించడం
- విత్తిన 7వ, 12వ వారంలో ఎన్.పి.వి. ద్రావణాన్ని నిర్ధారిత మొత్తంలో వాడటం
- సాలీడు, అక్షింతల పురుగు వంటి మిత్ర పురుగులు ఉండేలా చూడటం
- గుడ్డు దశలో వేప కషాయం చల్లడం
- లార్వా దశలో పచ్చి మిర్చి వెల్లుల్లి కషాయం, పొగాకు కషాయం చల్లడం
- కోశాస్థ దశలో ఉన్నవాటిని నియంత్రించడానికి వేసవి దుక్కులు
- ఎకరానికి 10 పక్షి స్థావరాలు పెట్టడం
ఎకరానికి ౩ కార్డుల (60000) ట్రైకోగామా పరాన్న జీవులను వదలడం
| |
 |
| గులాబి రంగు పురుగు ((Scientific Name Pectinophora gossypiella)
గులాబి రంగు పురుగు రబీలో, నవంబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది. పత్తితో పాటు , బెండను కూడా పాడు చేస్తుంది.
లక్షణాలు
పువ్వులు ఒక అమరిక లాగా మారతాయి. విత్తనంలోపల ఉన్న లార్వాలు విసర్జించిన వాటితో, అవి అంతకు ముందు చేసిన రంధ్రాలు పూడుకుపోయి. ఉంటాయి. పక్క పక్కన ఉన్న గింజలకు చేసిన రంధ్రాలతో అవి గుల్లగా మారతాయి. పురుగు ఆశించిన మొగ్గలు, పరిపక్వం చెందని కాయలు రాలిపోతాయి. మొక్క మొదలు భాగం రంగు కోల్పోతుంది. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయలు, మొగ్గలు, గింజలు
పురుగు జీవిత చక్రం
మొత్తం జీవిత చక్రం 4-5 వారాలు ఉంటుంది
గుడ్లు:
లేత పసుపు రంగులో గుంపులు, గుంపులుగా ఉంటాయి. ఒక ఆడ పురుగు రాత్రి పూట ఒకే సారి 150 గుడ్లు పెడుతుంది. తొడిమ
ెలు, మొగ్గలు, పువ్వుల మీద ఇవి విడివిడిగా కాని, గుంపులుగా కాని కనపడతాయి. ఈ దశలో 4-5 రోజుల పాటు ఉంటుంద |
 |
లార్వా (పిల్ల పురుగులు):
దాదాపు నాలుగు సార్లు రూపాంతరం చెందే పిల్ల పురుగులు బయట ఉష్నోగ్రాత్ 20 నుంచి 30 రోజుల పాటు ఈ దశలో ఉంటాయి. చలి కాలంలో పత్తి గింజలలో దాక్కుని, తిరిగి ఎండా కాలంలో బయటకు చురుకుగా మారతాయి. |
|
ప్యూపా (కోశాస్థ) దశ:
మొక్క అడుగు భాగం లేదా కింద ఉన్న చెత్త లేదా తొడిమె దగ్గర లేదా కాండంలో ఈ దశను గడుపుతుంది. ఇది 7-10 రోజుల పాటు ఉంటుంది. |
తల్లి పురుగు:
తల్లి పురుగు చిన్నగా ఉంటుంది. 4-6 రోజుల పాటు బతుకుతుంది. ఆహారం తినని ఈ దశలో కేవలం పునరుత్పత్తి మాత్రమే చేస్తుంది. |
 |
|
పురుగును గుర్తించడం
లార్వా (పిల్ల పురుగులు):
గులాబీ రంగులో ఉండే పిల్ల పురుగు తల మాత్రం గోధుమ రంగులో ఉంటుంది. 10 మిల్లి మీటర్ల
పొడవు ఉంటుంది. మొక్క మొదలు నుంచి మెల్లమెల్లగా విత్తనంలోకి దూరుతుంది.
తల్లి పురుగు:
చిన్న సైజులో ఉండే తల్లి పురుగు రెక్కలు ముదురు రంగులో, 10-15 మిల్లి మీటర్ల నిడివితో ఉంటాయి. ముందు రెక్కల మీద అక్కడక్కడా నల్లటి మచ్చలు ఉంటాయి కాని వెండి రంగులో ఉండే వెనుక రెక్కల మీద అలాంటి మచ్చలు ఏమీ ఉండవు. రెండు రెక్కలు సాగదీసినట్లు ఉంటాయి. వెనక రెక్క కొనలు మొనదీరినట్లు ఉంటాయి.
అనుకూల వాతావరణం
పంట వేసిన 40, 41, 4౩, మరియు 48, 49 వారాలలో ఉష్నోగ్రత, గాలిలో తేమ శాతంలో మార్పులను బట్టి పురుగు ఉధృతి ఉంటుంది.
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
హెక్టారుకు 2.5. లీటర్ల ట్రయజోఫోస్ 40 ఇ.సి. మరియు 20& క్వినోల్ఫోస్ మార్చి మార్చి చల్లాలి
- పంట అవశేషాలను తొలగించడం
- లో దుక్కి (లార్వా, ప్యుపా దశలలో పురుగును నియంత్రించడానికి)
- అదనులో విత్తడం
- విత్తన శుద్ధి
|
|
| ఆకు ముడత పురుగు
(Scientific Name Sylepta derogate)
పత్తి పంటను ఆశించే ప్రధాన పురుగులలో ఇది ఒకటి.
లక్షణాలు
- ఆకులు తప్పెట మాదిరి వంపులు తిరుగుతాయి. మధ్యలో సిల్క్ దారంతో కట్టినట్లు ఉంటాయి.
- ఆకులు అంచుల భాగంలో పురుగు తినేసిన గుర్తులు కనపడుతాయి.
- పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పచ్చదనం కోల్పోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
పురుగు జీవిత చక్రం
Rolled leaf Larva Adult
గుడ్లు:
ఆకుల కింద భాగంలో విడివిడిగా కనపడుతాయి. ఒక్కో ఆడపురుగు 200 – ౩౦౦ వరకు గుడ్లు పెడుతుంది. ౩ – 6 రోజులలలో ఇవి పొదగబడతాయి.
పిల్ల పురుగులు (లార్వా):
ఈ దశలో 15 – ౩5 రోజుల పాటు ఉంటాయి. పిల్ల పురుగులు ఆకు పచ్చ రంగులోనే ఉంటాయి. ఆకులపై కణజాలాన్ని తింటూ బతుకుతాయి. ఇలా ఆకులలోని కణజాలం లేకుండా పోవడం వల్ల ఆకులు ముడతలు తిరుగుతాయి.
కోశాస్థ (ప్యూపా) దశ :
ఆకు ముదతల లోనే ఈ దశను గడుపుతుంది. కోశాస్థ దశలో 6 – 12 రోజుల పాటు ఉంటుంది. |
 |
|
తల్లి పురుగు:
తల్లి పురుగు రెక్కలు పసుపు రంగులో ఉంటాయి. వాటి పైన గోధుమ రంగులో చారలు ఉంటాయి.
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
హెక్టారుకు 2 లీటర్ల క్లోరో ఫిరిఫాస్ 20 ఇ.సి. లేదా లీటరు డై క్లోరివాస్ 76 డబ్ల్యు ఎస్.సి లేదా 625 మిల్లి లీటర్ల ఫెనిత్రోథియాన్ 50 ఇ.సి. మందును చల్లాలి.
- జీవ పద్దతులు
- రోగం సోకినా మొక్కలను, మొక్క భాగాలను ఏరి నాశనం చేయాలి.
- పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి.
అనుకూల వాతావరణం
ఖరీఫ్ సీజనులో తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో పిల్ల పురుగులు చురుకుగా ఉంటాయి. వానలకు ముందు విత్తిన పంటకు పురుగు పట్టే అవకాశం ఎక్కువ |
| |
 |
పత్తి - తెగుళ్ళు
Cotton – Diseases
ఆకు మచ్చ తెగులు
ఇది పత్తిలో, ప్రత్యేకించి ఆకులపై సాధారణంగా ఆశించే ముఖ్యమైన తెగులు. అల్తెర్నేరియా మాక్రోస్పోరా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఎక్కువగా ఖరీఫ్ లో వచ్చే తెగులు ఇది. హైబ్రిడ్ పత్తి రకాలు ఈ తెగులుకి తేలికగా లోనవుతాయి. తెగులు సోకిన ఆకులు రాలిపోవడం వల్ల మొక్క ఎదుగుదల, పత్తి దిగిబడి తక్కువగా వుంటాయి. తెగులు పత్తి కాయలకు కూడా సోకితే పత్తి నాణ్యత దెబ్బతింటుంది. |
లక్షణాలు
ఆకుల కింది భాగంలో చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాటి చుట్టూ వంకాయ రంగు అంచులు ఉంటాయి. ఈ మచ్చలన్నీ కలసి ఒక్కటైన చోట ఆకు చిరిగిపోతుంది. ఇలా ఎక్కువగా ఆకుల అంచులలో జరుగుతుంది. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు నల్లగా మారుతాయి.. అప్పుడు ఆకులు రాలిపోతాయి. ఒక్కొక్కసారి ఆకుల ఈనెలు, కాయల పైన కూడా ఊదా రంగు వలయాకారపు మచ్చలు కనపడతాయి. కాండం పైన కూడా పుండ్ల మాదిరి కనపడతాయి. దెబ్బతిన్న ఆకులు పచ్చదనం కోల్పోయి చివరికి రాలిపోతాయి. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు
తెగులు జీవిత చక్రం
రోగ కారకమైన ఫంగస్ చనిపోయిన ఆకుల పైన ఉంటుంది. కుళ్ళని ఆకులు, వ్యాధి సోకిన విత్తనాలు ఈ ఫంగస్ వ్యాప్తికి తోడ్పడతాయి. వాటినుంచి వ్యాధి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. వ్యాధి సోకిన పంట అవశేషాల నుంచి మెల్లగా ఇది ఆరోగ్యంగా ఉన్నపంటను ఆశిస్తుంది. తొలుత కింద నున్న కొమ్మల ఆకులకు సోకుతుంది. రానురాను పంటకు మొత్తంగా ఎగబాకుతుంది. ఒక్కొక్కసారి కాయకు కూడా వ్యాపిస్తుంది. గాలిలో తేమ ఉన్నప్పుడు కాయను తొలిస్తే అది విత్తనానికి కూడా వ్యాపిస్తుంది. రోగం సోకిన మొక్క ఆకులు నేల రాలిన తరువాత ఈ ఫంగస్ జీవిత చక్రం ముగుస్తుంది.
అనుకూల వాతావరణం
ఎక్కువ తేమ, సగటు ఉష్ణోగ్రత ఉండి, మధ్య మధ్యలో వానలు పడుతున్నప్పుడు ఇది విస్తరిస్తుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు |
- తెగులు గమనించిన వెంటనే ప్రతి 15 రోజులకు ఒకసారి, లీటర్ నీటిలో 2.5 గ్రాముల మాన్కోజేబ్, లేదా ౩ గ్రాముల ఆక్సిక్లోరైడ్ చల్లాలి.
- కిలో విత్తనానికి 2-3 గ్రాముల డిఫోల్తాన్ లేదా ఇందోఫిల్ ఎం -45 కలిపి విత్తన శుద్ధి చేయడం
- తెగులు గమనించిన వెంటనే, 20 రోజులకు ఒకసారి, 0.2% డిఫోల్తాన్ లేదా మాన్కోజేబ్ ద్రావణాన్ని చల్లితే బాగా పనిచేస్తుంది.
జీవ పద్దతులు
రోగ నిరోధక శక్తి గల రకాలను మాత్రమే సాగు చేయాలి. దూది లేని విత్తనాలను, ప్రామాణిక విత్తనాలను మాత్రమే సాగు చేయాలి.
- సిఫార్సు చేసిన విత్తన మోతాదు, దూరాలు పాటించాలి.
- మోళ్లు తగల పెట్టటం వంటి చర్యలు చేపట్టాలి. తెగులు సోకిన భాగాలను తీసేసి తగల బెట్టాలి.
- అస్పిరజిల్లస్, ట్రైకోడెర్మ విరిడి వంటి జీవ నాశినులను ఉపయోగించాలి.
|
|
| ఆంధ్రానోస్ తెగులు Anthracnose disease
ఈ తెగులు ప్రధానంగా కలేక్టోటైక్రమ్ గాస్సిపి అనే ఫంగస్ వల్ల వస్తుంది. పత్తి, టమోటా, గింజ ధాన్యాలు, ఉల్లి, వెల్లుల్లి , నిమ్మ జాతి పంటలకు కూడా వచ్చే తెగులు ఇది. |
లక్షణాలు
బీజ దళాల మీద మొక్క మొదటి ఆకు మీద చిన్న ఎర్రటి మచ్చలు లేదా లేత రంగు మచ్చలు ఏర్పడతాయి.
కాండలకు ఏమైనా గాయాలు వుంటే వాటి ద్వార రోగం దాడి చేసి మొక్కలను బలహీన పరుస్తుంది. పత్తి కాయలకు అన్ని దశలోనూ తెగులు ఆశిస్తుంది. శిలింద్రం దూది లోకి , గింజల్లోకి విస్తరిస్తుంది. దూది పసుపుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారి ముద్దగా అయిపోతుంది. తెగులు సోకిన పత్తి కాయల పైన చిన్న, గుండ్రటి లోపలికి నొక్కులా వుండే మచ్చలు ఏర్పడతాయి, ఇవి ఎరుపు గోధుమ రంగులోనూ, నీటితో తడిచినట్లు ఉంటాయి. తీవ్రంగా ప్రభావితమైన విత్తనాలు తేలికగా, గోధుమ రంగులో వుండి పూర్తిగా తయారై వుండవు. ఇవి సాధారణంగా మొలకెత్తవు. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు
తెగులు జీవిత చక్రం
ఈ తెగులు ప్రధానంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. విత్తటంతోనే శిలీంద్రం క్రియాశీలకం అవుతుంది. ఆ తరువాత ఇది గాలి ద్వారా, నెలలోని కొనిడియా ద్వారా వ్యాపిస్తుంది. తేమ, తడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తెగులు వేగంగా వ్యాపిస్తుంది. మొక్క చిన్న దశలో వడిలి పోవటం, కాండం మీద మచ్చలు, కాయ కుళ్ళి పోవటం వంటివి సంభవిస్తాయి. తెగులు సోకిన కాయల ద్వారా విత్తనాలు వ్యాధిగ్రస్తమవుతాయి.
అనుకూల వాతావరణం
వత్తుగా ఉన్న పైరు, తేమ, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితులు తెగులు వృద్ది చెందటానికి అనుకూలిస్తాయి.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- ఆమ్లంతో దూది లేకుండా చేసిన విత్తనం వాడాలి
- కార్బండైజిం లేదా బెనొమిల్ తో విత్తన శుద్ధి
- కార్బండైజిం లేదా బెనొమిల్ లీటరు నీటికి 1.5 గ్రాముల చొప్పున లేదా మంకోజేబ్ లీటరు నీటికి ౩ గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి
- పత్తి పంట మోడు, విత్తన మోతాదు నేల తయారీ వంటి వాటికి సిఫార్సు చేసిన పద్దతులు పాటించాలి
- ధృవీకరించిన విత్తనాలను తెగులును తట్టుకునే రకాలను విత్తాలి.
- చేనులోనీరు నిలబడకుండా చూడాలి
- తెగులు సోకిన మొక్కల వ్యర్ధాలను తగులబెట్టాలి
- పిలక పంట సాగు చెయ్యకూడదు
|
| |
 |
ఫ్యూజేరియం ఎండు తెగులు Fusarium Wilt
ఈ తెగులు ఫ్యూజేరియం వాసిన్ పెక్టం అనే ఫంగస్ వల్ల వస్తుంది. ప్రధానంగా పత్తి పంటను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
కాండం లోపల గోధుమ రంగు చారలు ఉంటాయి. పంట అన్ని దశలలో తెగులు సోకుతుంది. మొలక దశలో బీజ పత్రాలు పసుపుపచ్చ, గోధుమ రంగులలోకి మారటం తెగులుకి మొదటి సూచిక. చిన్న, పెద్ద మొక్కలలో ఆకులు వడిలినట్లు అయ్యి, పసుపు పచ్చ, ఆ తరువాత గోధుమ రంగులలోకి చివరికి ఆకులు రాలిపోతాయి. వడిలి పోయిన మొక్కలో ప్రధాన వేరు అంతగా పెరిగి వుండదు, పక్క వేళ్లు కూడా తక్కువగా వుంటాయి. కాండం మధ్య కణజాలం గోధుమ నల్ల రంగులలోకి మారుతుంది. తెగులును నిర్ధారించటానికి ముఖ్య మైన లక్షణం. ముదిరిన కాండం పై నల్లటి చారలు కనబడతాయి. ఆకుల అంచుల నుండి రంగు మారటం మొదలయ్యి మధ్య ఈనె వరకు మారతాయి. మొక్క పూర్తిగా లేదా కొంతవరకు వడలవచ్చు. |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం
తెగులు జీవిత చక్రం
నులి పురుగులు, ఇతర పురుగుల వల్ల మొక్కల వేళ్ళకు అయిన గాయాలు, రంధ్రాలు ద్వారా శిలీంద్రం లోపలికి ప్రవేశిస్తుంది. వేళ్ళ కణజాలాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా మొక్క పై భాగానికి పోషక పదార్ధాలు అందక ఎదుగుదల కుంటుబడుతుంది. దీనివల్ల మొక్క వడలినట్లు అయిపోతుంది. శిలీంద్రం దారు కణజాలంతో కణతులు ఏర్పడేలా చేసి పోషకాలు పైకి వెళ్ళే మార్గాన్ని అడ్డుకుంటుంది. శిలీంద్రం కొన్ని రకాల మొక్కలలో ఫ్యూ జేరిక్ ఆమ్లం ఉత్పతి చేయటం వల్ల కూడా మొక్క వడలిపోయే లక్షణాలు కనబడతాయి. శిలీంద్రం కుళ్ళిన సేంద్రియ పదార్ధంలోనూ, సిద్ధ బీజాల రూపంలోనూ నేలలో అనేక సంవత్సరాల పాటు సజీవంగా వుంటుంది. ఈ శిలీంద్రం విత్తనాల లోపల, బయట వుండి తెగులు వ్యాప్తికి కారణమౌతుంది. శిలీంధ దారాలు, సిద్ధ బీజాలు కూడా తెగులు వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
అనుకూల వాతావరణం
తేమతో కూడిన వాతావరణ పరిస్తితులు (ఉష్ణోగ్రతలు 23 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన గాలిలో తేమ శాతం 85 శాతం పైన) తెగులు వ్యాప్తికి ప్రత్యేకంగా అనుకూలిస్తాయి. గాయాలు ఉన్న మొక్కలలో (ఉదాహరణకు నులి పురుగుల వల్ల మొక్క దెబ్బతిని ఉంటే) ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది. క్షార లక్షణాలున్న బంక మట్టి నేలలో శిలీంద్రం వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. నులి పురుగులు బూడిద రంగు ముక్కు పురుగులు మొక్క వేళ్ళల్లోకి శిలీంద్రం తేలికగా ప్రవేశించేలా చేస్తాయి. నల్ల నేలల్లో వర్షాల తరువాత పొడిగా, వేడిగా వుండే వాతావరణం ఈ శిలీంద్రం తెగులు సోకటానికి అనువుగా వుంటుంది. నత్రజని, భాస్వరం, మ్యాంగనిస్ ఎరువులు తెగులు వృద్దికి, జింకు, పోటాష్ తెగులు తగ్గటానికి దోహదం చేస్తాయి.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- పెంటపోగు ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులు, పోటాష్ ఎరువు వాడాలి. నత్రజని, భాస్వరం ఎరువులు సమతుల్యంతో వాడాలి.
- తెగులుని తీవ్రతరం చేస్తుంది కాబట్టి అమోనియా రూపంలోని నత్రజని ఉపయోగించకూడదు.
- కార్బెండా జిం ౦.1. శాతం ద్రావణంతో తెగులు లక్షణాలు వున్న చోటబాగా కలపాలి.
- తెగులు వ్యాప్తి చెందకుండా మంచి సాగు పద్దతులు దోహదం చేస్తాయి
- తెగులు తట్టుకునే రకాలను సాగు చెయ్యాలి
- చేనులో నీళ్ళు నిలబడకుండా మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి
- తెగులు సోకిన మొక్క భాగాలను తగలబెట్టాలి
- 5౦ కిలోల పెంట పోగు ఎరువుకి 2 కిలోల ట్రైకోడెర్మ విరిడి కలిపి పంట చాల్లల్లో వేస్తేతెగులు వ్యాప్తి తగ్గుతుంది.
|
|
| వేరు కుళ్ళు తెగులు Root tot disease
ఈ తెగులు రైజోక్టోనియా బటాటి కోలా అనే ఫంగస్ వల్ల వస్తుంది. పత్తితో పాటు కొన్ని రకాల కూర గాయలను కూడా ఆశిస్తుంది. |
లక్షణాలు
మొక్క ఒక్కసారిగా పూర్తిగా వదలిపోవటం (ఇది మొదటి స్పష్ట మైన లక్షణం). ఆకులు రాగి లేదా పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. తెగులు సోకిన మొక్కల వేళ్లు, ప్రత్యేకించి వేళ్ళ బెరడు దారాలుగా పిగిలినట్లు ఉంటుంది. సాధారణంగా వృతాకార ప్రాంతంలో తెగులు సోకిన మొక్కలు ఉంటాయి, వీటిని గుర్తించి తేలికగా పీకెయ్యవచ్చు. ప్రధాన వేరు ఒక్కటి బాగుండి మొక్క నిలబడి ఉండేలా చేస్తుంది, పక్క వేళ్ళన్ని దాదాపుగా కుళ్లిపోయి ఉంటాయి. అప్పుడే వడలిపోయిన మొక్క వేళ్ళ చివరి భాగం తడిగా, జిగటగా ఉంటుంది
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, వేళ్ళు
|
 |
|
తెగులు జీవిత చక్రం
ఈ రోగ కారక జీవి పరాన్న భుక్కు. నేలలోని కుళ్ళుతున్న సేంద్రియ పదార్ధంలో చాల సంవత్సరాలు పాటు సజీవంగా వుంటుంది. బలహీనంగాఉన్నమొక్కరోగకారకజీవితోసంపర్కంలోకిరాగానేఆజీవివేళ్ళల్లో |
వేగంగా వృద్ది చెందుతుంది. చివరికి వేరు / కాండం మధ్య భాగంలోకి దారు కణజాలంలోకి విస్తరిస్తుంది. తెగులుకి లోనైనా మొక్క వేళ్ళల్లో కాల్షియం, ఇనుము, ఇతర విష పదార్ధంలు అధిక మోతాదులో జమ అవుతాయి. దీనివల్ల మొక్క వడలిపోయిన లక్షణాలను కనబరుస్తూ వుండవచ్చు. ఈ శిలీంద్రం ఇతర పంటలపైన కూడా వృద్ది చెందుతుంది. పత్తిని తిరిగి విత్తినపుడు శిలీంద్రం మళ్ళి క్రియాశీలకంగా అయ్యి పంటకు తెగులు ఆశింప చేస్తుంది.
అనుకూల వాతావరణం
ఈ శిలీంద్రం వేసవిని కూడా తట్టుకుని బతికి వుంటుంది. నేల ఉష్ణోగ్రతలు ౩5 డిగ్రీల సెంటిగ్రేడ్, నేలలో తేమ శాతం 15-2౦ శాతం ఉండే ఇసక నేలలు, ఒండ్రు నేలలు తెగులుకి అనుకూలం.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- బ్రాస్సికాల్ + క్యాప్టాన్, దేమోసాన్లతో శుద్ధి చేస్తే తెగులు సోకటం తగ్గుతుంది
- కార్బండాజితోనూ క్వింటో జీన్తోనూ విత్తన శుద్ధి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
- పత్తిని మిటికేలతో (Moth bean, Vigna acomitifolia) మిశ్రమ పంటగా సాగు చేస్తే తెగులు సోకటం తగ్గుతుంది
- నేల ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేనప్పుడు విత్తనం విత్తాలి. మిటికేలతో కలిపి పత్తిని సాగు చెయ్యటం వల్ల తెగులు తీవ్రతరం కాకుండా వుంటుంది
- 5౦ కిలోల పెంట పోగు ఎరువుకి 2 కిలోల ట్రై కోడెర్మ విరిడి కలిపి చాళ్లల్లో వేస్తే తెగులు సోకటం తగ్గుతుంది.
- పంటను ముందుగా అంటే వేసవి చివరలో విత్తితే తెగులు సోకకుండా తప్పించుకోవచ్చు.
|
|
|
| |
 |
 |
‘సేర్కోస్టోరా అకుమచ్చ తెగులు
ఇది స్కేర్కోస్టోర్ లేదా మైక్రో స్పారేల్లా గాస్సిపాన్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. పత్తితో పాటు చిరు ధాన్యాలు, కూరగాయలను కూడా ఆశిస్తుంది.
లక్షణాలు
- ఆకుల మీద ఎర్రటి చుక్కలు ఏర్పడి క్రమేపి పెద్దవవుతాయి. పెరిగిన మచ్చల అంచులు ఎర్రగా వుండి మధ్యలో భాగం తెలుపు లేదా లేత గోధుమ రంగులో వుంటుంది
- తరువాత ఈ మచ్చలు వృతాకారం కోల్పోయి వాటి బయటి వైపు పసుపు పచ్చ అంచు ఏర్పడుతుంది
- ఆకులు పండుబారి చాలా ముందుగా రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
తెగులు జీవిత చక్రం
...........................
అనుకూల వాతావరణం
సగటు ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమ శాతం ఎక్కువగా వుంటే తెగులు వ్యాప్తికి చాలా అనుకూలంగా వుంటుంది
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
శిలీంద్ర నాసినులైన కాపర్అక్సిక్లోరిడ్ లీటరు నీటికి ౩ గ్రాముల చొప్పున లేదా మాంకోజెబ్ లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి
- ఆమ్లంతో పింజ తీసేసిన, ధృవీకృత , రోగ నిరోధక శక్తి గల విత్తనాలను ఉపయోగించాలి.
- సిఫారసు చేసిన భూమి తయారీ, విత్తన మోతాదు, మోల తొలగింపు, రసాయనిక ఎరువులు, సాగునీటి వినియోగం వంటి పద్దతులను పాటించాలి
- పత్తి తీసిన తరువాత పంట మోళ్ళను నాశనం చేయాలి
|
| (వేర్టిసిలియం) వడలే తెగులు
ఈ తెగులు వేర్టిసిలియం డలియే అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఎక్కువగా పత్తి పంటలోనే వస్తుంది.
లక్షణాలు
తెగులు మొదటి లక్షణాలు ఆకుల మీద కనబడతాయి. ఆకుల అంచులు, మధ్య ఈనెల మీద పాలిపోయిన పసుపు పచ్చ రంగులో మచ్చలు ఏర్పడతాయి. చుక్కల మచ్చలు కూడా ఏర్పడతాయి. అకులోని పసుపు పచ్చ మరింత పాలిపోయి, తెల్లగా అయ్యిచివరికి ఆ భాగం చచ్చిపోతుంది. ప్రభావితమైన కాండాన్ని నిలువుగా చీల్చి చూస్తే నీటిని పోషక పదార్ధాలను సరఫరా చేసే కణజాలం ఉదా, ఉదాలతో కూడిన గోధుమ రంగులోకి మారి వుండటం కనపడుతుంది. ఈ రోగ కారక జీవి వల్ల వేళ్ళ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం, వేళ్ళు |
 |
తెగులు జీవిత చక్రం
నేలలో వుండే సాధారణ శిలీంద్రల్లో వేరిసిలియం డలియే ఒకటి, ఇది పలు పంటలకు కలుపు మొక్కలను ఆశిస్తుంది. ఇది వేళ్ళలోకి చొచ్చుకు పోయి నీటికి సరఫరా చేసే కణజలాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మొక్కకి నీరు అందక వడలిపోయిన లక్షణాలు కనపడతాయి. సాగునీరు ఎరువైన సరైన యాజమాన్యం ద్వారా ఈ తెగులును కొంతవరకు నియంత్రించవచ్చు. రోగ నిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేయటం ముఖమైన యాజమాన్యం వ్యూహం. నేలలో ఈ సిలిద్రం ఎక్కువగా వుంటే పత్తి సాగు చేయకూడదు. ఒకే నేలలో వరసగా నాలుగు సంవత్సరాల పాటు పత్తిని పండించ కూడదు. ఈ తెగులుకు లోనయ్యే కలుపు మొక్కలు పత్తి చేలో లేకుండా చెయ్యాలి. పంట మధ్య కాలంలో వాతావరణ పరిస్తితులు అనుకూలంగా వున్నప్పుడు తెగులు బాగా వ్యాప్తి చెంది మొక్క మళ్ళి కోలుకునే అవకాశం వుండదు కాబట్టి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. ఇటువంటి పరిస్థితులు దిగుబడులు ౩౦ శాతం వరకు తగ్గవచ్చు.
వేరిట్టిసిలియం వడిచే తెగులు చిన్న మొక్కను కూడా ఆశించవచ్చు. కానీ మొదటి పూత నుంచి పత్తి తీత వరకు ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది. కింది ఆకుల నుంచి మొదలకుని లేత ఆకుల వరకు ఆకు ప్రధాన ఈనెల మధ్య భాగం క్రమేపి పసుపు పచ్చ రంగుకి మారి ఆ భాగం ఎండి పోతుంది. ఈ లక్షణాలు ప్యూజేరియం తెగులులో కూడా ఇదే విధంగా ఉంటాయి.
అనుకూల వాతావరణం
చల్లని వాతావరణం, నేలలో అధిక తేమ. నేలలో నత్రజని స్తాయి ఎక్కువగా వునప్పుడు ఈ తెగులు విస్తరించటానికి అనుకూలంగా వుంటుంది. ఈ తెగులుకి నిరోధక శక్తి ఉష్ణోగ్రత బట్టి వుంటుంది. 25-27 సెంటి గ్రేడ్ వద్ద తెగులుకు గురికాని రకాలు కూడా 2౦-22డిగ్రీల సెంటి గ్రేడ్ వద్ద తెగులుకు లోనవుతాయి.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- బెనోమిన్ లేదా బెనిట్తో నేలను బాగా తడపటం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
- సిస్టమిక్ లేదా ఆర్గాన్ మేర్కురియాల్ శిలీం ద్ర నాసినులతో విత్తనా శుద్ధి చెయ్యటం వల్ల తెగులును సమర్ధంగా అరికట్టవచ్చు.
- జీవ పద్దతులు
- పత్తి పంట తరువాత గింజ ధాన్యపు పంటలు సాగు చేయటం ద్వారా పత్తిలో వడలు తెగులును సమర్ధంగా అరికట్టవచ్చు.
- రోగ నిరోధక శక్తి గల రకాలను సాగు చేయటం ద్వారా తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
|
|
 |
బాక్టీరియా అకుమచ్చ తెగులు Bacterial blight
ఈ తెగులు క్సాంతోమోనాస్ మాల్హాసిరం అనే బాక్టీరియా వల్ల వస్తుంది. పత్తి పంటలోనే వస్తుంది.
లక్షణాలు
బీజ దళాల మీద బాక్టీరియా అకుమచ్చ తెగులు వల్ల చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇవి మొదట ముదురు అకుమచ్చ రంగులో వుండి తరువాత గోధుమ రంగులోకి మారతాయి. చిన్న మొక్కలు, పెద్ద మొక్కల కాండల మీద నల్లటి కణ తులు ఏర్పడతాయి. ఆకు మీద లక్షణాలు పైరు ఎదుగుదల కాలమంతట కనిపిస్తాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా సగటు ఉష్ణోగ్రతలు 86-95 డిగ్రీల ఫారిన్ హీట్ మధ్య వుండి తరచు వాన, బాగా మంచు, పొగ మంచు, లేదా తుంపర సేధ్యం తరచు చేస్తూ వుంటే ఆకుల మీద లక్షణాలు తీవ్రంగా వుంటాయి. |
ఆకుల మీద లక్షణాలు ముందుగా దాని అడుగు పై భాగాలలో లేత ఆకు పచ్చ మచ్చలు కనబడతాయి. ఈ మచ్చలు సాధారణంగా ఇంచులో 1/16 నుంచి 1/8 వంతు వుండి త్వరగా ముదురు గోధుమ, నల్ల రంగులోకి మారతాయి. ఈ మచ్చల అంచుల కోణకారంలో వుంటాయి. ఎక్కువ మచ్చలున్న త్వరగా రాలిపోతాయి. ఈ తెగులు పత్తి కాయలను కూడా సోకవచ్చు. కాయలపై గుండ్రంగా లేత ఆకు పచ్చ రంగులో వుండే మచ్చలు క్రమేపి కాయ కుళ్ళిపోటానికి దారి తియ్యవచ్చు.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు
తెగులు జీవిత చక్రం
ఈ తెగులు మొదట బీజ దళాల మీద ఆశించి తరువాత ఆకులకు విస్తరింస్తుంది. ఆకుల మీద మొదట అడుగు భాగాన, తరువాత పైన చిన్న, ముదురు ఆకు పచ్చ రంగులో నీటితో తడిచిన మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు విస్తరిస్తూ గోధుమ రంగులోకి మారతాయి. ఒక మచ్చ ఈనెలను దాటి విస్తరించదు. కాబట్టి మచ్చలు గుండ్రంగా కాకుండా అంచులు కోణకారపు అకుమచ్చ దశ అంటారు. ఈనెల వంటి ఈ వ్యాధి ఆకు తొదిమకీ, కాండానికి వ్యాపిస్తుంది. దీనివల్ల కాండం మీద పొడవాటి, నల్లని చరాలు ఏర్పడతాయి. దీనిని నల్ల కాళ్ళ దశ అంటారు. గాలికి కొమ్మ తేలికగా విరిగిపోతుంది. తెగులు లక్షణాలు పువ్వు రక్షక్ పత్రం మీద, కాయ మీద కూడా కనపడతాయి. రోగ కారక జీవి పత్తి పిమ్జలోకి విస్తరిస్తుంది. రోగ కారక జీవి విత్తనం బయట, లోపల కూడా వుంటుంది. తెగులు సోకిన విత్తనం ద్వారా ఇది ప్రధానంగా విస్తరిస్తుంది.
అనుకూల వాతావరణం
తేమతో కూడిన గాలులు ఉన్న వాతావరణం బాక్టీరియా మచ్చ తెగులుకు అనుకూలిస్తుంది. మొక్క కణజాలంలో గాయాలు వుంటే తేలికగా తెగులుకు లోనవుతుంది. 25 డిగ్రీల సెంటి గ్రేడుకి పైబడిన ఉష్ణోగ్రతలు, 85 శాతానికి మించి గాలిలో తేమ వున్నప్పుడు ఈ తెగులు బాగా వ్యాప్తి చెందుతుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- తెగులు వృద్ది చెందకుండా అరికట్టేచర్యలుఏమి లేవు. గ్రోత్ రెగ్యులేటర్లు ఉపయోగించి తెగులు వ్యాపించకుండా ఒక్కటే రైతులు చెయ్యగలిగిన పని.
- ఆమ్లం ద్వారా పింజ లేకుండా చేసిన విత్తనం ఉపయోగిస్తే విత్తనం ద్వారా ఈ తెగులు సోకకుండా నియంత్రిచవచ్చు.
- ఈ తెగులుకు కొంత నిరోధక శక్తి గల రకాలు వున్నాయి. ఈ తెగులు తీవ్రంగా వున్న ప్రాంతాల్లోఇవి కొంతవరకు ఉపయోగకరంగా వుంటాయి.
- దూది తియ్యటం అయిపోయిన వెంటనే చేను దున్నితే, పంట అవశిస్టాలు అన్నీ కుళ్ళటానికి తగిన సమయం వుండి తెగులును అరికట్టడంలో దోహదం చేస్తుంది.
- గాలిలో తేమ శాతం తక్కువ వుండేలా చేను మరీ కమ్ముకోకుం డా వుండాలి, ఆకులు తడరిపోయేలా చేయటం ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు
- ఆకులు తడిగా వునప్పుడు అంతర కృషి చేపట్టవద్దు, పరికరాలను పొలంలో గుండా తీసుకోని వెళ్ళవద్దు.
- తెగులు సోకిన పంటలో సాధ్యమైనంత త్వరగా పత్తిని తీసేయ్యాలి. అవకాశం దొరికిన వెంటనే మోళ్ళను తీసి నాశనం చెయ్యాలి.
- బాక్టీరియా అకుమచ్చ తెగులు సోకిన చేనులో మరు సంవ్సతరం పంట మార్పిడి చెయ్యాలి, లేదా బాక్టీరియా మచ్చ తెగులును నిరోధించే రకాలను సాగు చెయ్యాలి.
|
ఆకు ముడుత తెగులు
ఇది జెమినీ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ తెల్ల దోమ (బెబినియా టబాసి) ద్వారా వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
చిన్న ఈనెలు లావుగా అవ్వటం ఈ తెగులు ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ లక్షణం ముందుగా పై లేత ఆకుల మీద కనపడుతుంది. ఆకులు పైకి / కిందకి ముడతపడి దోనే ఆకారంలోకి మారతాయి, ఈనెలు పెద్దగా అవుతాయి. తెగులు తీవ్రంగా వున్న పరిస్తితుల్లో మొక్క కణుపుల మధ్య దూరం తగ్గి ఎదుగుదల కుంటుపడుతుంది, పూత / కోత తక్కువగా వుంటుంది. |
 |
|
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
తెగులు జీవిత చక్రం
పత్తి ఆకు ముడత తెగులు ఇంటి పోగు వృతాకార జెమినీ వైరస్ ద్వారా వస్తుంది, ఈ వైరస్ లో ఒక డిఎన్ఎ, డిఎన్ఎ, 1 , డిఎన్ఎ, బీటా అన్న రెండు ఉపగ్రహాలు వుంటాయి. ఇది తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది.
పత్తి పంట సాగు చెయ్యని కాలంలో అనేక రకాల కలుపు మొక్కలు, ఇతర పంటలు ఈ తెగులుకు ఆలవాలంగా వుంటాయి. పత్తి వేసినప్పుడుఅక్కడినుంచే ఈ తెగులు తెల్ల దోమ ద్వారా సోకుతుంది. పత్తి పంట కాలంలో కూడా కలుపు మొక్కలు వంటి వాటి మీద ఈ వైరస్ వృద్ది చెందుతూనే వుంటుంది.
అనుకూల వాతావరణం
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రోగ నిరోధక శక్తి గల రకాలను రూపొందించటం ద్వారా ఈ తెగులును సమర్ధంగా అరికట్టవచ్చు
- తెల్ల దోమను అరికట్టాలి, రసాయనిక, సాగు, జైవిక నియంత్రణ పద్దతులను ఉపయోగించి తెల్ల దోమ సంఖ్యను తగ్గించాలి.
- తెగులుకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను నిర్మూలించాలి
- సిస్టమిక్ పురుగు మందులతో విత్తన శుద్ధి చేయటం ద్వారా పంట తొలి దశల్లోతెల్ల దోమను నియంత్రిచటం ద్వారా తెగులును అరికట్టవచ్చు
|
| |
 |
 |
బూడిద (మిల్ డ్యూ ) తెగులు
ఇది రాములేరియా ఏరియెలా అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఈ తెగులు పత్తిలోనే వస్తుంది.
లక్షణాలు
కాయలు ఏర్పడే దశలో కింద వుండే ముదురు ఆకులలో మొదట దీని లక్షణాలు కనపడతాయి. ఆకుల ఈనెలు అంచులుగా వుండి ప్రత్యేక ఆకారం లేకుండా వుంటాయి. ఆకులు పండుబారి, గోధుమ రంగుకు మారి త్వరగా రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
తెగులు జీవిత చక్రం
మొక్క బాగా పెరిగిన దశలో ఈ తెగులు ముదురు ఆకుల మీద కనపడుతుంది. 1-1౦ మి.మీ. పరిమాణంలో మసక ప్రత్యక ఆకారం లేకుండా ఏర్పడతాయి. ఆకు ఈనెలు ఈ మచ్చలకు అంచులుగా వుంటాయి. ఈ మచ్చలు ఆకు పై వైపున లేత పసుపు పచ్చ, ఆకు పచ్చ కలిసిన రంగులో వుంటాయి. మచ్చలు క్రమేపి పసుపు పచ్చ గోధుమ రంగులోకి మారతాయి. ఆకుల అడుగున తెల్ల నురగ లాంటి ఎదుగుల కనపడుతుంది. ఇది శిలీంద్రం కొనీడియల్ దశ. ప్రభావితమైన ఆకులు చివరికి రాలిపోతాయి. ఉష్ణ , ఉప ఉష్ణ వాతావరణంలో రోగ కారక జీవి చెట్ల మీద, దానికి ఆశ్రయ మిచ్చే ఇతర మొక్క మీద బతికి వుంటాయి. అక్కడినుంచి పత్తి పంట మీదకి వ్యాపిస్తాయి.
ఒకసారి పత్తికి ఈ తెగులు సోకిన తరువాత గాలి, సాగు నీళ్ళు, పనివాళ్ళు, చేలో నడిపే యంత్రాల ద్వారా తెగులు వ్యాపిస్తుంది. ఈ శిలీంద్రం ఆకు గాలి పీల్చేరంధ్రం గుండా మొక్క లోపలికి ప్రవేశిస్తుంది. రాత్రి తడిగాను, పగలు పొడిగాను వుండే పరిస్తితులు ఈ తెగులుకు అనుకూలం. నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలావుంటే తెగులు ఉధృతంగా ఆశిస్తుంది.
అనుకూల వాతావరణం
గాలిలో తేమ శాతం వుంటే తెగులు వ్యాప్తికి అనుకులిస్తుంది. పంట వ్యర్ధ పదార్ధలో ఈ రోగ కారక జీవి సజీవంగా వుంటుంది. రాత్రి తడిగాను, పగలు పొడిగాను వుండే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం. నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలావుంటే తెగులు ఉధృతంగా ఆశిస్తుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- కార్బండాజిం లేదా బెనోమిల్ 1 గ్రాము ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా హెక్టరుకు 8-1౦ కిలోల గంధకం పొడి చల్లాలి. లేదా బోర్దాక్స్ డిఎప్ లేదా ౩ శాతం కాపర్ శిలీంద్రం నాశినిని పూయ్యాలి.
- లోతైన దుక్కిపంట అవసిస్టాలను నాశనం చేయాలి
- ఆమ్లంతో పింజ తొలగించిన, ధృవ్రీకృత, రోగ నిరోధక శక్తి గల రకాలను సాగు చెయ్యాలి
- గింజ ధాన్యాలతో పంట మార్పిడి చేయాలి
|
| |
 |
|
| |
|
|
|
|