| |
త్రిప్స్
Scientific Name : Scirtothrips dorsalis and Calithrips indicus
ఈ పురుగు మిరప, వంకాయ, పత్తి, ఆముదం, వేరు శనగ, సొర కాయ పంటలను ఆశిస్తుంది. |
లక్షణాలు
నీళ్ళు పెట్టిన మిరప పంట కన్నా నీళ్ళు పెట్టని పంటలోనే ఈ పురుగు ఎక్కువగా వస్తుంది. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల మీద కణజాలాన్ని తినేస్తాయి. రసాన్ని పీల్చేస్తాయి. కొన్ని సార్లు, మొగ్గలు, పువ్వులను కూడా నాశనం చేస్తాయి. మామూలుగా పురుగు లేత ఆకులను, ఇతర లేత భాగాలపై మాత్రమే ఎక్కువగా దాడి చేస్తుంది. పెరిగిన ఆకుల జోలికి పోదు. |
 |
|
పురుగు దాడి వల్ల ఆకులు పైకి వంకర తిరుగుతాయి. వడలి రాలిపోతుంటాయి. పురుగు సోకిన మొగ్గలు బలహీనంగా మారి విరిగిపోతాయి. ఆకు కాడ కూడా గోధుమ రంగుకు మారి పడిపోతుంది. పురుగు వల్ల దెబ్బ తిన్న పండ్లపై లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పురుగు సోకినప్పుడు పంట నష్టం ౩0% – 50% వరకు ఉంటాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు 40 – 48 గుడ్లు పెడుతుంది. ఇవి చిన్నగా తెల్లగా ఉంటాయి. ఆకుల ఈనెల దగ్గర ఈ గుడ్లు కనపడతాయి. 6 – 9 రోజులలో గుడ్లు పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
2 - ౩ రోజులలో పిల్ల పురుగు రెండు రకాలుగా రూపాంతరం చెందుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
మొక్కలోని వివిధ రక్షిత ప్రదేశాలలో ఈ దశను గడుపుతుంది.
తల్లి పురుగు
ఆడ, మగ పురుగులు కలిసిన తరువాతనే పురుగులో సంతానోత్పత్తి జరుగుతుంది. అయితే ఒక్కోసారి మగ పరుగు ఆడ పురుగు కలవకుండానే సంతానోత్పత్తి జరుగుతుంది.
ఈ పురుగులు ఏడాది పొడవునా చురుకుగా ఉంటాయి. సగటున 2 నుంచి 2. 5 వారాలలో పురుగు జీవిత చక్రం పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో 25 తరాలు పూర్తి అవుతాయి.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు చిన్నగా, మూత్ర పిండాల ఆకారంలో ఉంటాయి. 0.075 మిల్లి మీటర్ల పొడవు, 0. 0౩0 మిల్లి మీటర్ల వెడల్పు ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
సన్నగా, బలహీనంగా ఉంటాయి. పసుపు రంగు కలిగి ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు 0.౩7 – 0.౩9 మిల్లి మీటర్ల వెడల్పు, 0.68 – 0. 71 నుంచి 0.78 – 0.80 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. |
 |
తల్లి పురుగు
రెక్కల పురుగులు కూడా సన్నగా, బలహీనంగా, గడ్డి రంగులో ఉంటాయి. కొన్ని సార్లు పురుగులు రంగు లేనట్టు కనపడతాయి. రెక్కల అంచులు తీర్చి దిద్దినట్లు ఉంటాయి. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- విత్తన శుద్ధి – కిలో విత్తనాలకు ౩ – 5 గ్రాముల ఇమిదాక్లోప్రిడ్ మందు కలిపి చల్లాలి.
- లీటరు నీటికి ౩ గ్రాముల కార్బారిల్ లేదా ౩ మిల్లి లీటర్ల ఫోసాలేన్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లి లీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.౩ మిల్లి లీటర్ల స్పినోసాద్ లేదా 1. 2 గ్రాముల డయాఫెంతియురాన్ కలిపి, ఆకుల కింద భాగంలో తడిసేలా చల్లాలి.
- నాటిన తరువాత, 15 రోజులకు ఒక సారి, 45 రోజులకు ఇంకొకసారి, ఎకరానికి 8 కిలోల ఫిప్రోనిల్ 0.౩ జి చల్లాలి.
- జీవ పద్దతులు
- అంతర పంటలు - అగాతి సేస్బానియా గ్రాన్డిఫ్లోరా
- జొన్న తరువాత మిరప వేయకూడదు. అలా చేస్తే పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
- మిరప, ఉల్లి పంటలు కలిపి వేయకూడదు. ఈ రెండు పంటలను కూడా పురుగు నాశనం చేస్తుంది.
- మొలకలపై నీళ్ళు చల్లుతూ, పురుగు అభివృద్ధిని నియంత్రించవచ్చు.
|
|
 |
కాయ తొలుచు పురుగు / లద్దె పురుగు
Scientific Name : Spodoptera litura and Spodoptera exigua and Utetheisa pulchella |
|
లక్షణాలు
ఈ పురుగు అనేక రకాల పంటలను ఆశిస్తుంది. పురుగు (స్పోడోప్తేరా లితురా, స్పోడోప్తేరా ఎక్సిగువా) సోకినప్పుడు ఆకులు, కాయల మీద రంధ్రాలు ఏర్పడతాయి. కాడలు తెల్లగా మారి ఎండిపోతాయి. పండ్లలో గింజలను కూడా పురుగు తినేస్తుంది. కొన్ని సార్లు పండ్ల మీద గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి. ఉటేతిసియా పుల్చేల్ల పురుగు పండ్లలోని గింజ పైభాగాన్ని మాత్రమే తింటాయి. దీనివల్ల ఉల్లి కాడ మీద నిచ్చెన లాంటి గుర్తులు ఏర్పడతాయి. ఈ పురుగు పాతి, చిరు ధాన్యాల పంటలను కూడా పాడు చేస్తుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు |
 |
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు గుంపులుగా ౩00 నుంచి 500 వరకు గుడ్లను పెడుతుంది. 4 – 5 రోజులలో ఇవి పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
సీజను, ఆహార లభ్యత బట్టి పిల్ల పురుగు దశ 20 – ౩0 రోజుల పాటు ఉంటుంది. గుంపులు, గుంపులుగా పిల్ల పురుగులు వలస పోతుంటాయి. అయితే రాత్రి పూట మాత్రం మొక్క అడుగు భాగం దగ్గర విశ్రాంతి తీసుకుంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
నేలలో కొన్ని సెంటి మీటర్ల లోతుకు బోరియలు చేసుకుని ఈ దశను గడుపుతుంది. పైన ఎతువంటి గూడు ఉండదు. ఈ దశలో పెద్ద మొత్తంలో ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో వారం రోజులు, పరిస్థితులు అనుకూలించనప్పుడు కొన్ని నెలల పాటు ఈ దశలో గడుపుతుంది.
తల్లి పురుగు
రెక్కల పురుగులు ఎక్కువగా రాత్రి పూట సంచరిస్తూ ఉంటాయి. 5 నుంచి 10 రోజుల పాటు బతుకుతాయి. ఈ మధ్య కాలంలోనే సంతానోత్పత్తి జరుగుతుంది. |
 |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు దాదాపుగా 4 – 7 మిల్లి మీటర్ల వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. ముదురు గోధుమ లేదా బంగారు గోధుమ రంగులో కనపడుతాయి. గుడ్ల గుంపు మీద వెంట్రుకలు కప్పబడి ఉంటాయి. ఆకుల కింద భాగంలో ఇవి కనపడుతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు తొలుత చాలా చురుకుగా కదులుతూ ఉంటుంది. పారదర్శకమైన పచ్చటి రంగు శరీరంతొ, నల్లటి గొంతు భాగాన్ని కలిగి ఉంటుంది. శరీరం చాలా మృదువుగా ఉంటుంది. పైన ఎరుపు, పసుపు, ఆకు పచ్చ గీతలు ఉంటాయి. తల వెనుక భాగంలో నల్లటి మచ్చ ఉంటుంది. పెరిగిన తరువాత పిల్ల పురుగుల శరీరం మీద, రెండు పక్కలా గోధుమ, నలుపు కలిసిన మచ్చలు ఉంటాయి. పురుగు పెరుగుతున్న కొద్దీ ఈ మచ్చలు, రంగు స్పష్టంగా కనపడుతాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగును గుర్తు పట్టడం చాలా కష్టం. నేల లోపల బొరియ చేసుకుని అందులో ఉంటాయి. ఒక వారం నుంచి కొన్ని వారాల పాటు ఈ దశను గడుపుతుంది. ముదురు గోధుమ నుంచి మెరిసే ఎరుపు రంగులో ఉంటాయి. పైన గూడు ఉండదు.
రెక్కల పురుగు
పెద్ద పురుగు రెక్కలు గోధుమ రంగులో ఉండి, రెక్కల మీద తీర్చిదిద్దినట్లు ఉంటుంది. ప్రధానంగా రెక్కల అంచుల మీద ఈ డిజైన్ ఆకారపు మచ్చలు కనపడుతాయి.
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటరు నీటికి 1 మిల్లి లీటరు నోవులురాన్ లేదా 1 గ్రాము డైఫ్లూబెంజురాన్ కలిపి చల్లితే పిల్ల పురుగులు నియంత్రించబడుతాయి.
- లీటరు నీటికి 1 గ్రాము థయోడి కార్బ్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ లేదా 2.5 మిల్లి లీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా 0.౩ మిల్లి లీటర్ల స్పినోసాద్ లేదా 2 మిల్లి లీటర్ల క్వినాల్ఫాస్ మందు కలిపి చల్లాలి
- విషపు గుళికలు - 5 కిలోల రైస్ బ్రాన్, 500 మిల్లి లీటర్ల క్లోరోఫైరిఫాస్ లేదా 500 గ్రాముల కార్బారిల్, 500 గ్రాముల బెల్లానికి తగినంత నీటిని కలిపి చిన్న చిన్న విషపు గుళికలను తయారుచేసి, సాయంత్రం వేళల్లో వాటిని పొలంలో అక్కడక్కడా వేయాలి.
- జీవ పద్దతులు
- లోదుక్కి - పొలాన్ని లోతుగా దున్నాలి
- ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగును పర్యవేక్షించాలి.
- ఎర పంటలుగా ఆముదం, బంతి వంటి పంటలను వేయాలి.
- ఎస్ఎన్ పి వి / ఎన్ పి వి ద్రావణం చల్లడం - ఎకరానికి 250 లీటర్లు, సాయంత్రం వేళల్లో చల్లాలి.
|
|
 |
పేను బంక
Scientific Name: Aphis gossypii, Myzus persicae
పత్తి, మిరప, ఇతర కూరగాయలతో పాటు . అనేక పంటలను ఆశించే పురుగు ఇది. |
 |
లక్షణాలు
పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలోనూ, మొక్కలో పెరిగే ఇతర భాగాలలోనూ పెద్ద సంఖ్యలో ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల రసాన్ని పీలుస్తాయి. అదే క్రమంలో తేనే లాంటి జిగట ద్రవాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ ద్రవం చుట్టూ నల్లటి ఫంగస్ ఏర్పడుతుంది. దీనివల్ల మొక్క ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. మొక్కలో ఎదుగుదల నిలిచిపోవడం వల్ల కాయలు పెట్టే సామర్ధ్యం తగ్గుతుంది. పురుగు సోకిన మొక్క ఆకులు వంకర తిరిగి, ముడతలు పడి ఉంటాయి. |
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగు చలి కాలంలో గుడ్లు పెడుతుంది. ఒక్కో సారి నేరుగా పిల్లలనే పెడుతుంది
పిల్ల పురుగు (లార్వా) దశ :
రోజుకు ఒక్కో ఆడ పురుగు 8 నుంచి 22 పిల్ల పురుగులను పెడుతుంది. నాలుగు దశల రూపాంతరం తరువాత పిల్ల పురుగు పెద్ద పురుగుగా మారుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
పెద్ద పురుగు
పెద్ద పురుగుకు రెక్కలు ఉండవచ్చు, ఉండక పోవచ్చు. ఇవి ఎక్కువగా నేరుగా ఆడ పిల్లలను కంటాయి. పురుగు జీవిత చక్రం 7 – 10 రోజులలో పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో అనేక తరాలు వస్తాయి.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
ఎక్కువగా ఈ దశ ఉండదు. పురుగు నేరుగా పిల్లలనే పెడుతుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు పసుపు లేదా ఆకుపచ్చ గోధుమ రంగులో కనపడుతాయి. ఆకుల కింద భాగంలో తిరుగుతూ ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశ ఉండదు. |
  |
తల్లి పురుగు
తల్లి పురుగు ఆకుపచ్చ గోధుమ రంగులో ఉంటుంది. శరీరం చాలా మృదువుగా ఉండే చిన్న పురుగులు ఇవి. పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిటికి రెక్కలు ఉండడం కూడా గమనించవచ్చు. శరీరం చాలా మృదువుగా ఉంటుంది. రెక్కలున్న పురుగు 1.65 మిల్లి మీటర్లు, రెక్కలు లేని పురుగు 1.5౩ మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. శరీరం మీద రెండు మచ్చలు / గీతలు కనపడతాయి. |
 |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటరు నీటికి 1 మిల్లి లీటరు డిమిటాన్ లేదా 1. 5 గ్రాము అసిఫేట్ కలిపి చల్లితే మంచి ఫలితాలు ఉంటాయి.
అనుకూల వాతావరణం
మబ్బులు పట్టిన వాతావరణంలో పురుగు సంతానోత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. వానలు బాగా పడినప్పుడు పురుగు ఉధృతి తగ్గుతుంది. |
|
ఎర్ర లేదా పచ్చ నల్లి
Scientific Name: Polyphagotarsonemus latus, Tarsonemus translucens, Tetranychus cinnabarinus
మిరప, ఇతర కూరగాయల పంటలను ఆశిస్తుంది. |
లక్షణాలు
ఇది ఒకప్పుడు ఈ పంటకు తక్కువగా సోకేది కానీ ఈ మధ్య కాలంలో దీని ఉధృతి చాలా పెరిగింది. పురుగు సోకడం మొలక దశలోనే మొదలవుతుంది. మొలకెత్తిన 40 రోజుల లోపల పురుగు సోకుతుంది. నాటిన తరువాత రెండు మూడు నెలల కాలంలో పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాలా చిన్నగా, తెల్లటి రంగులో ఉండే ఈ పురుగులు ఆకుల కింద భాగంలో గుంపులు గుంపులుగా కనపడుతాయి. అన్నీ కలిసి గూడు మాదిరిగా అల్లుకుంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకులు, మొక్కలోని ఇతర లేత భాగాల నుంచి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల మొక్క బలహీనపడి చచ్చిపోతుంది.
ఈ పురుగు సోకినప్పుడు ఆకులు వంకర తిరుగుతాయి. తిరగేసిన బోటు మాదిరిగా మారుతాయి. కాడ అంచుల వెంబడి ఆకులు మెల్లగా రాలిపోతుంటాయి. కొన్ని సందర్భాలలో ఆకులు చిక్కటి పచ్చటి రంగుకు మారుతాయి. కొమ్మ చివరన ఉన్న లేత ఆకులు అన్నీ ఒకచోటుకు వచ్చి గూడులాగా మారుతాయి. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
గుడ్లు ఆకుల కింద భాగంలో ఒక రకమైన జిగురు వంటి పదార్ధం ఆసరాగా వాటిని అంటి పెట్టుకుని ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి బయటికి వచ్చే పిల్ల పురుగులు చాల చిన్నవిగా ఉండి, మూడు జతల కాళ్ళని కలిగి ఉంటాయి. తెలుపు రంగులో కనపడుతాయి. చాలా మెల్లగా కదులుతూ ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
పెద్ద పురుగు
పెద్ద పురుగు 8 నుంచి 10 రోజుల పాటు బతుకుతుంది. ఈ మధ్య కాలంలోనే గుడ్లను పెడుతుంది.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు బల్లపరుపుగా ఉండి, తెలుపు రంగులో కనపడుతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశ ఉండదు. |
 |
పెద్ద పురుగు
పెద్ద పురుగు 0.1 మిల్లి మీటరు పొడవు ఉంటుంది. బల్ల పరుపుగా ఉంది, పసుపు, ఆకుపచ్చ రంగులో కనపడుతుంది. శరీరం మొత్తం పారదర్శకంగా ఉంటుంది. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- లీటరు నీటికి 5 మిల్లి లీటర్ల డైకోఫాల్ లేదా ౩ గ్రాముల తడి గంధకం కలిపి చల్లాలి.
- లీటరు నీటికి ౩ మిల్లి లీటర్ల ఫోసాలేన్ లేదా 1.5 గ్రాముల డయా ఫెంతూరియన్ కలిపి చల్లాలి.
- పురుగులను చంపే మిత్ర పురుగులను ప్రోత్సహించాలి. (అంబ్లిసేయాస్ ఒవాలిస్ వంటివి)
అనుకూల వాతావరణం
చలి కాలపు తొలి రోజులు ఈ పురుగుకు అనుకూలం |
|
శనగ పచ్చ పురుగు
Scientific Name: Helicoverpa armigera
శనగ పచ్చ పురుగు మిరప, పత్తి, చిరుధాన్యాలు, టమాట, అనేక ఇతర పంటలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
పిల్ల పురుగులు మొక్కలోని లేత భాగాలని నాశనం చేస్తాయి. పెరిగిన తరువాత ఈ పురుగులు కాయలు, పండ్లలోకి చొచ్చుకుపోయి వాటిని పాడు చేస్తాయి. |
 |
|
|
మొక్కలో పాడయ్యే భాగాలు
కాయలు, పండ్లు, మొక్కలోని ఇతర లేత భాగాలు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
మొక్కలోని వివిధ భాగాలపై తల్లి పురుగు విడివిడిగా గుడ్లను పెడుతుంది. ఆయా భాగాల పైన, కింద ఇవి కనపడుతాయి. ఒక్కో తల్లి పురుగు 500 వరకు గుడ్లను పెడుతుంది. 4-5 రోజుల లోపల ఈ గుడ్లు పొదగబడతాయి. గుడ్లు గుండ్రంగా ఉండి, తెలుపు లేదా ఆకు పచ్చ రంగులో ఉంటాయి. మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు గుడ్లకు అంచులు కూడా కనపడుతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
సీజను, ఆహార లభ్యత బట్టి పిల్ల పురుగు దశ 14 నుంచి 20 రోజుల పాటు ఉంటుంది. పిల్ల పురుగు దశలో 6 రూపాంతరాలు ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశను నేల లోపల గానీ లేదా మొక్క అడుగు భాగాన ఉన్న చెత్తలో కానీ గడుపుతుంది. ఈ దశలో 10 – 15 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
ఈ దశలో పురుగు ఆహారం తినదు. 6 నుంచి 8 రోజుల పాటు బతుకుతుంది. మగ పురుగుతొ కలిసిన తరువాత ఆడ పురుగు గుడ్లను పెడుతుంది. మొత్తం జీవిత చక్రం 40 రోజులలోపల పూర్తి అవుతుంది. |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. తెల్లగా ఉండి, పైన ఒక రకమైన చారలను కల్గి ఉంటాయి. (మైక్రో స్కోప్ కింద ఇవి కనపడుతాయి.) గుడ్లు విడివిడిగానే ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
రూపాంతర దశ బట్టి, అది ఉన్న పంట రంగును బట్టి పిల్ల పురుగు రంగు మారుతూ ఉంటుంది. ఆకుపచ్చ, పసుపు, గులాబి, నారింజ, గోధుమ లేదా నలుపు రంగులో కనపడుతుంది. శరీరం రెండు పక్కలా తెలిపాటి, ముదురు మచ్చలు ఉండడం పిల్ల పురుగుల ప్రత్యేక లక్షణం.
పిల్ల పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పచ్చ దనాన్ని గీకి తింటూ ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ కాడలు, మొగ్గలు, పువ్వుల లోనికి చొచ్చుకుపోయి వాటిని తిని పాడు చేస్తాయి. ఇలా చొచ్చుకుపోవడం వల్ల ఆయా భాగాలపై గుండ్రటి రంధ్రాలు ఏర్పడతాయి. వాటి దగ్గర పురుగు విసర్జితాలు కూడా కనపడతాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు గోధుమ రంగులో కనపడుతుంది. నేల లోపల గానీ, మొక్క అడుగు భాగాన ఉన్న చెత్తలో కానీ ఈ దశను గడుపుతాయి. |
 |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- లీటరు నీటికి 2 గ్రాముల కార్బారిల్ లేదా 2 గ్రాముల బి. తురింజియెన్సీస్ కలిపి చల్లాలి.
- హెక్టారుకు 1.25 కిలోల కార్బారిల్, 12. 5 కిలోల రైస్ బ్రాన్, 1.25 కిలోల బెల్లాన్ని 7. 5 లీటర్ల నీటికి కలిపి విషపు గుళికలు తయారుచేసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి. లేదా
- ఈ కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక మందును, తెలిపిన మోతాదులో చల్లాలి
పురుగు మందు |
మోతాదు |
ఎమామేక్టిన్ బెంజోఎట్ 5% ఎస్.జి. |
4 గ్రాములు /10 లీటర్లు |
ఫ్లుబెండియా మెయిడ్ 20 డబ్ల్యు డి.జి |
6 గ్రాములు /10 లీటర్లు |
ఇందోక్సా కార్బ్ 14. 5% ఎస్.సి |
6.5 మిల్లి లీటర్లు /10 లీటర్లు |
నోవా లురాన్ 10% ఇ.సి |
7..5 మిల్లి లీటర్లు /10 లీటర్లు |
స్పినో సాడ్ 45% ఎస్.సి |
౩.2 మిల్లి లీటర్లు /10 లీటర్లు |
థయోడికార్బ్ 75% డబ్ల్యు.పి |
2 గ్రాములు / లీటర్ |
- జీవ పద్దతులు
- పురుగు సోకిన కాయలు, పండ్లు సేకరించి, వాటిలోని పిల్ల పురుగులను నాశనం చేయడం
- హెక్టారుకు 15 లింగాకర్షక బుట్టలు పెట్టడం
- సహజ శత్రువులైన పురుగులను వదలడం - పంట పూత దశలో వారానికి 50000 లెక్కన, ఆరు సార్లు టి. చిలోనిస్ వంటి పురుగులను వదలాలి. అదే రీతిలో, వారం వారం క్రిసోపేర్లా కార్నియా గుడ్లను 500౦౦ వరకు వదలడం
- హెచ్ఎ ఎన్ పివి ద్రావణం - హెక్టారుకు ౩00 పత్తి గింజల నూనెను కలిపి ఈ ద్రావణాన్ని చల్లాలి.
|
|
తెల్ల దోమ White fly
Scientific Name: Bemacia tabaci
తెల్ల దోమ మిరప, పత్తితొ పాటు అనేక ఇతర పంటలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో రసాన్ని పీల్చేస్తాయి. అదే క్రమంలో ఒక రకమైన జిగట వంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆకులపై గాయాలు అయినట్లు మచ్చలు ఉంటాయి. పైన బూజు వంటి ఫంగస్ ఏర్పడుతుంది. ఈ పురుగు ఆకు వంకర తెగులు వైరస్ వ్యాప్తి చేస్తుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
 |
|
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు 50 గుడ్లను పెడుతుంది. ఆకుల కింద భాగంలో తేలికపాటి పసుపు రంగు గుడ్లు కనపడతాయి. ౩ – 5 రోజులలో గుడ్లు పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు కూడా తేలికపాటి పసుపు రంగులోనే ఉంటాయి. గుంపులుగా ఉండి, స్తబ్దుగా ఉంటాయి. వేడి వాతావరణంలో 9 – 14 రోజుల పాటు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 17 – 81 రోజుల పాటు పిల్ల పురుగు దశ ఉంటుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ 2 – 8 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
పెద్ద పురుగు శరీరం పసుపు రంగులో ఉంటుంది. పారదర్శకంగా కనపడుతుంది. మైనపు రెక్కల మాదిరి ఉంటాయి. వెనుక కాళ్ళు పొడవుగా ఉంటాయి.
పురుగు మొత్తం జీవిత చక్రం 14 – 120 రోజులలో పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో 14 తరాలు పూర్తి అవుతాయి. ఏడాది పొడవునా సంతానోత్పత్తి జరుగుతుంది. ఒక్కొక్క సారి మగ పురుగుతో కలవకుండానే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. |
 |
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
_
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు ఆకుపచ్చ పసుపు రంగులో కనపడతాయి. శరీరం అంచులు బల్ల పరుపు ఆకారంలో ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు బల్లపరుపు ఆకారంలో ఉంటుంది. ఆకుల అడుగున విశ్రాంతి తీసుకుంటుంది.
తల్లి పురుగు
తల్లి పురుగులు సైజులో చాలా చిన్నగా ఉంటాయి. శరీరం పసుపు రంగులో ఉంటుంది. పైన తతెల్లటి మైనపు వంటి పూతతో మెరుస్తూ వుంటుంది. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- రసాయన పురుగు మందులు పెద్దగా పనిచేయవు. పైగా పురుగు ఉధృతి పెరుగుతుంది.
- అవసరమైనప్పుడు, లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ట్రయజోఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల ప్రోఫనోఫాస్ కలిపి చల్లాలి.
- జీవ పద్దతులు
- పసుపు పచ్చ ప్లేట్లు - గ్రీసు లేదా నూనె రాసిన ఈ పసుపు పచ్చ ప్లేట్లకు తెల్ల దోమలు బాగా ఆకర్షించ బడతాయి.
- వేప కషాయం చల్లడం – (5 % నూనె లేదా 5 గ్రాముల కషాయం )
- పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయడం
అనుకూల వాతావరణం
ఈ పురుగు అన్ని కాలాలలోనూ మనగలుగుతుంది
|
|
| Damping off డ్యాంపింగ్ ఆఫ్
ఇది పైథియం అఫాని దేర్మాటం అనే ఫంగస్ వల్ల వస్తుంది. మిరప , వంకాయ, టమాట పంటలను ఆశిస్తుంది. |
లక్షణాలు
తెగులు సోకినప్పుడు ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో, నీటిలో తడిసినట్లు మచ్చలు మొలక మొత్తం కనపడతాయి. తొలుత వేర్ల మీద ఈ మచ్చలు మొదలై క్రమేపి మిగతా లేత భాగాలకు వ్యాపిస్తాయి. రాను రాను ఈ మచ్చలన్నీ కలిసి పెద్ద మచ్చగా మారుతుంది. ఈ క్రమంలో మొలకలు వడలి ఎండిపోతాయి. వేర్ల కణజాలం వదులుగా మారి గుల్లగా మారుతుంది.
ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనపడతాయి. మొలక రాక ముందు అయితే, నేలలోనే విత్తనం, మొలక కుళ్ళిపోయి చనిపోతాయి. మొలక నేల నుంచి బయటకు రాదు. మొలక వచ్చిన తరువాత దశలో తెగులు సోకితే, మొలక అడుగు భాగంలోని లేత కణజాలం దెబ్బ తింటుంది. మెత్తగా, మృదువుగా మారి, నీటిలో తడిసినట్లు ఉంటుంది. క్రమేపి ఆ భాగం కుళ్లిపోయి, మొలక నిలబడలేక పడిపోతుంది. చివరకు చనిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
వేర్లు, మొలకలు |
 |
|
తెగులు జీవిత చక్రం
ఈ ఫంగస్ అనేక రకాల పంటలని ఆశిస్తుంది. నేలలో, పంట చెత్తలో, కలుపు మొక్కలలో ఫంగస్ బతికి ఉంటుంది. నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, మొక్కల మధ్య దూరం తక్కువగా ఉండి, వాటి మధ్య గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించకుండా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఫంగస్ చాల చురుకుగా ఉంటుంది. నీటి ద్వారా ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపిస్తుంది..
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- విత్తన శుద్ధి -
- కాపర్ ఆక్సి క్లోరైడ్ (0.25%) మందును మట్టిలో చల్లాలి.
- జీవ పద్దతులు
- నేలలో తడి, తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. మురుగు నీరు పోయేటట్లు తగిన సౌకర్యాలు ఏర్పాటు చూసుకోవాలి.
- పంటల మార్పిడి చేయాలి.
- పాశ్చరైజ్ద్ మట్టిని నర్సరీలో వాడాలి.
అనుకూల వాతావరణం
తడి నేలలు, మురుగు నీరు పోయే సౌకర్యం లేని పొలాలు, గాలిలో తేమ 90% – 100%, నేలలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణ పరిస్థితులు తెగులు వ్యాప్తికి అనుకూలం. |
|
| Anthracnose ఆంత్రాక్ నోస్
ఇది కోలేటోట్రైకం క్యాప్సికి అనే ఫంగస్ వల్ల వస్తుంది. మిరపతొ పాటు మరికొన్ని రకాల పంటలు, కూరగాయలను ఆశిస్తుంది. |
లక్షణాలు
తెగులు సోకిన మొక్కల భాగాలపై నల్లటి మచ్చలు గుల్ల బారినట్లు కనపడతాయి. ఈ మచ్చలు ఫంగస్ జీవ కణాల వల్ల ఏర్పడతాయి. ఆకుల మీద, కాయల మీద తొలుత ఇవి చిన్నగా గుండ్రంగా ఉంటాయి. రానురాను కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పచ్చదనం కోల్పోతాయి.
ఈ తెగులు ప్రధానంగా మూడు దశలలో కనపడుతుంది. ఎండిన విత్తనం, ఆకు మచ్చ, కాయ కుళ్ళు దశల్లో తెగులు తన ప్రభావాన్ని చూపుతుంది. తెగులు సోకితే కాయ బరువు తగ్గుతుంది. కొన్ని రకాల ఫంగస్ వల్ల కాయలు ఎర్రగా మారుతాయి.
కాయల పైన చిననాటి, నల్లటి, గుండ్రటి మచ్చలు కనపడతాయి. తెగులు పెరుగుతున్న కొద్దీ మచ్చలు విస్తృతమవుతాయి. నల్లగా లేదా ఆకుపచ్చగా రంగులో కనపడే ఈ మచ్చల చుట్టూ చిక్కటి, నల్లటి గీతల మాదిరి ఉంటాయి. మచ్చ మధ్యలో లేత నలుపు లేదా గడ్డి రంగులో కనపడుతుంది. కొన్ని సార్లు మచ్చలు గోధుమ రంగులో కూడా కనపడుతాయి. క్రమేపి ఇవి నలుపు రంగుకు మారుతాయి. తెగులు ఎక్కువగా ఉంటే కాయ ఎరుపు రంగు నుంచి గడ్డి లేదా తెలుపు రంగుకు మారుతుంది. తెగులు సోకిన కాయను కోసి చూసినప్పుడు లోపల గుండ్రంగా, చిన్నటి, నల్లటి మచ్చలు చూడవచ్చు. విత్తనాలకు సోకినప్పుడు వాటి చుట్టూ ఉండే ఫంగస్ వల్ల అవి తుప్పు పట్టినట్లు కనపడుతాయి. చివరకు కాయ గుల్లబారి ఎండిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాయలు |
 |
|
తెగులు జీవిత చక్రం
ఈ తెగులు పంట కోతకి ముందు, కోత తరువాత కూడా కాయలను పాడు చేస్తుంది. తెగులు సోకినప్పుడు ప్రధానంగా కాయ నాణ్యత తగ్గడం వల్ల ఆర్ధిక నష్టం కల్గుతుంది. ఫంగస్ వల్ల లోపల, బయట కూడా విత్తనం పాడవుతుంది. ఇలాంటి విత్తనాలను వాడి నాటినప్పుడు మొలక రాక ముందు, మొలక వచ్చిన తరువాత కూడా మొక్కలు చనిపోతాయి. విత్తనాలే ఈ ఫంగస్ కు ప్రాధమిక ఆతిధ్యమిస్తాయి. కాండం, కొమ్మలు వంటి భాగాల మీద కూడా ఫంగస్ చురుకుగా ఉంటుంది. దీనివల్ల ఆయా భాగాలు చచ్చుబడిపోతాయి. వర్షా కాలంలో జూన్ – అక్టోబర్ మధ్య కాలంలో వాతావరణం తెడిగా ఉన్నప్పుడు ఫంగస్ చురుకుగా ఉంటుంది. తెగులు వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.
తెగులు వ్యాప్తి చేసే ఫంగస్ పంట చెత్తతో పాటు, ఆశించే ఇతర పంటలపై (టమాట, బంగాళా దుంప, వంకాయవంటి పంటలపై) బతికి ఉంటుంది. వాన పడినప్పుడు ఆ నీటితో పాటు ఫంగస్ జీవ కణాలు మిరప పంటను ఆశిస్తాయి. కాయలను పాడు చేస్తాయి. తెగులు సోకిన కాయలో కూడా ఫంగస్ జీవ కణాలు ఉత్పత్తి అవుతాయి.
వేడి, తడి వాతావరణం ఉన్నప్పుడు తెగులు సోకుతుంది. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు తెగులు అభివృద్ధి ఎక్కువ. అయితే ఉష్ణోగ్రత ఎక్కువున్నా, తక్కువున్నా తెగులు సోకే అవకాశం ఉంది. వానలు పడుతునప్పుడు మాత్రం నష్టం ఎక్కువగా ఉంటుంది. వానల ద్వారా జీవ కణాలు ఇతర మొక్కలకు తొందరగా సోకడమే దీనికి కారణం. మామూలుగా పక్వానికి వచ్చిన కాయలలో తెగులు సోకినప్పటికీ, పక్వానికి రాని కాయలకు కూడా ఇది సోకే అవకాశముంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- పెరినాక్స్, అజాక్సి త్రోబిన్. క్లోరాతలానిల్, కాపర్, డిఫేనోకోనాజోలె, ఫమోక్సాడొన్, ఇప్రోదియోన్, ప్రోసిమిడొన్ టోలిఫ్లుయానిడ్, కార్బెండైజిం వంటి మందులతో తెగులును అరికట్టవచ్చు.
- తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, లీటరు నీటికి 2.5 గ్రాముల మానేబ్ మందుని కలిపి చల్లితే మంచి ఫలితాలు ఉంటాయి
- లీటరు నీటికి ఒక మిల్లి లీటరు అజాక్సి త్రోబిన్ లేదా త్రిఫ్లాక్సిస్త్రోబిన్ లేదా పైరాక్లోస్త్రోబిన్ లేదా డిఫెంకోనాజోల్ మందును కలిపి చల్లినా తెగులు నియంత్రణలో ఉంటుంది. తొలి రెండు ఆకులు వచ్చినప్పుడు తొలిసారి చల్లాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి లెక్కన రెండు సార్లు చల్లాలి.
- జీవ పద్దతులు
- తెగులు సోకిన మొక్కల నుంచి విత్తనాలను విత్తడం, నాటడం చేసినప్పుడు తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాలను వాడాలి.
- తెగులు సోకిన మొక్కలను ఏరి నాశనం చేయాలి.
- పొలంలో తెగులుకు కారకమయ్యే ఫంగస్ కు ఆతిధ్యమిచ్చే కలుపు మొక్కలను కూడా ఏరిపారేయాలి.
- నారు మడులలో నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పొలంలో మురుగు నీరు పోయే సౌకర్యం ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
- విత్తన నిరోధక వంగడాలను వాడాలి ( ఐ ఐ హెచ్ ఆర్ 275 – 1౩-5, ఐ ఐ హెచ్ ఆర్ ౩45 – 6, ఐ ఐ హెచ్ ఆర్ ౩౩2 – 109, సి.సి 4 , ఉజ్వల, హెచ్ 1,, హెచ్ 4, హెచ్ 6, సి. ఎ 87- 4, ఎస్ – 20- 1, లోరై., బి.జి – 1 వంటి వంగడాలు వాడవచ్చు)
- సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ తో విత్తనాలను శుద్ధి చేయాలి.
- ట్రైకో డేర్మా జాతికి చెందిన పురుగులు తెగులు నియంత్రణకు దోహదపడతాయి.
- Other biological control agents that have been tested for efficacy against Colletotrichum include Bacillus subtilis and Candida oleophila.
Plant products have been tested in many laboratories. Seed and spray treatment showed that the crude extract from rhizome, leaves and creeping branches of sweetflag (Acorus calamus L.), palmorosa (Cymbopogon martinii) oil, Ocimum sanctum leaf extract, and neem (Azadirachta indica) oil could restrict growth of the anthracnose fungus.
అనుకూల వాతావరణం
కాయ పక్వానికి వచ్చే దశలో, వాన పడినప్పుడు తేమ ఎక్కువగా ఉంటే తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పంట నష్టం చాలా (84% ) ఉంటుంది. |
లక్షణాలు
తెగులు సోకిన మొక్క ఆకుల మీద గుండ్రటి గోధుమ రంగు మచ్చలు కనపడతాయి. వీటి మధ్యలో బూడిద రంగులో వలయాలు ఏర్పడతాయి. చుట్టూ గోధుమ రంగు అంచులు కూడా కనపడతాయి. కొన్ని సార్లు మచ్చలు 1 సెంటి మీటర్ కన్నా ఎక్కువ వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. మచ్చలన్నీ కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి. కాండం, పత్రాలు, మొగ్గల మీద మచ్చలలో మధ్యన తెలిపాటి బూడిద రంగులోనూ, చుట్టూ చిక్కటి అంచులతోనూ ఉంటాయి. అయితే మొత్తమ్మీద అవి గుండ్రంగానే ఉంటాయి. తెగులు బాగా సోకిన ఆకులు తొందరగా ఎండి రాలిపోతాయి. దానివల్ల మొక్క ఎదుగుదల నిలిచి, పంట దిగుబడి తగ్గుతుంది. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం
తెగులు జీవిత చక్రం
తెగులు సోకిన పంట అవశేషాలలో ఈ ఫంగస్ ఒక ఏడాది పాటు బతికి ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితులతో పాటు వేడి పరిస్థితుల్లో కూడా తెగులు అభివృద్ధి చెందుతుంది. ఫంగస్ జీవ కణాలు గాలి ద్వారా, వాన ద్వారా, సాగు నీటి ద్వారా, వ్యవసాయ ఉపకరణాల ద్వారా, మనషుల ద్వారా ఇతర ప్రాంతాలకు వలస పోతాయి.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- తెగులు సోకిన మొక్కలపై, మాన్కోజేబ్ (0.25%) లేదా క్లోరో తలోనిల్ (0.1%) మందును 10 – 15 రోజులకు ఒకసారి లెక్కన రెండు సార్లు చల్లాలి.
- జీవ పద్దతులు
- పంట అవశేషాలను తిరగేయడం లేదా పూర్తిగా తీసి నాశనం చేయడం అవసరం.
- పంటల మార్పిడి పద్ధతి పాటించాలి.
- తెగులుకు కారకమయ్యే ఫంగస్ జీవ కణాలు మొక్క దరి చేరకుండా, మొక్కల చుట్టూ మల్చింగ్ చేయాలి. లేదా చిన్న చిన్న గుంతలు తవ్వాలి.
అనుకూల వాతావరణం
వేడి, తడి వాతావరణ పరిస్థితుల్లోనూ ఫంగస్ చురుకుగానే ఉంటుంది. |
|
 |