తెనేమంచు పురుగు :
ఈ పురుగులు రసాన్ని పీల్చడం వలన పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మల నుండి కూడ రసం పీల్చడంతో ఆకులు ముడతపడి అంటుకుంటాయి.  సరిగా పెరగవు. పురుగులు విసర్జించిన తేనెలాంటి బంక ఆకుల మీద కారి, సూర్యరశ్మి వెలుతురులో మెరుస్తుంది.
నివారణ :  లీటరు నీటికి ఫాస్పామిడాన్ ౦.5 మిల్లి లీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లి లీటర్లు  లేదా కార్బరిల్ ౩ గ్రాములు లేదా డైమీధోయెట్ 2 మిల్లి లీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లి లీటర్లు కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్ళపైన కొమ్మలపైన కూడ పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోకముందే పిచికారి చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారి చేయడం వలన పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపించిన యెడల కార్బరిల్ ౩ గ్రాములు లేదా ఇమిడక్లోప్రిడ్ ౦.౩ మిల్లి లీటర్లు. + కార్బడైజిం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ధయోమిదాక్సాం ౦.౩ గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయుట వలన పూత మరియు కాపు సమయంతో తేనే మంచు పురుగును సమర్దవంతంగా నివారించవచ్చు.

1 మిల్లి లీటరు మిధైల్ పెరదియన్ 50%  ఇ.సి మందును లీటరు నీటికి కలిపి పోసి గానీ లేదా పెట్రోల్ లేదా అల్యూమినియం ఫాస్పేట్ బిళ్ళలను వేసి గానీ బంకమట్టితో ముయాలి.

 

కాయతొలుచు పురుగు :
నిద్రావస్థ దశ పూర్తయిన తర్వాత రెక్కల పురుగు వెలువడి కాయల మీద గ్రుడ్లు పెడుతుంది. ఈ పురుగు మామిడి పండ్ల సీజనులో మూడు తారలు వృద్ది చెంది మే నెలాఖరున నాలుగవ తరంలో ఉన్న ఎదిగిన క్రిమి పురుగులు ఎండు పుల్లల్లోకి చేరి కొన్ని నెలల పాటు నిద్రావాస్ధలో వుండి ఆ తర్వాత పంటను ఆశిస్తాయి.
నివారణ :     మామిడి పంట పూర్తి అయిన తరువాత ఎండుకొమ్మలను తీసివేసి నాశనం చేయాలి.  పురుగు ఆశించిన కాయలను చెట్టు నుండి కోసి నాశనం చేసి పురుగు వ్యాప్తి నివారించాలి. జనవరి మాసం రెండవ పక్షంలో క్లోరిఫిరిఫాస్ 2.5 మిల్లి లీటర్లు లేదా డైక్లోరవాస్ 1.5 మిల్లి లీటర్లు లేదా కార్బరిల్ ౩ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయలి.  మామిడి పిందెలు గోలి సైజు లేక గొంగలి పురుగులు వలస వెళ్ళు సమయంలో డైక్లోరవాస్ 1.5 మిల్లి లీటర్లు లేదా క్లోరిపైరిస్ 2.5 మిల్లి లీటర్లు లేదా కార్బరిల్ లేదా వేప నూనె ౩ మిల్లి లీటర్లు. + క్లోరిపైఫాస్ 1 మిల్లి లీటర్లు లెక్కన ఒక లీటరు నీరుకు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.

 

తామర పురుగు / రాతి మంగు :
ఇది తామర పురుగుల వల్ల కలుగుతుంది. కీటకాలు మామిడి కాయలను పిందె దశలో ఆశించి పై చర్మాన్ని గీకడం వల్ల మంగు ఏర్పడుతుంది. ఈ పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లి లీటర్లు గాని, కార్బరిల్ ౩ గ్రాములు గాని లేదా డైమిధోయోట్ 1.5 మిల్లి లీటర్లు లేదా ఇమిడక్లోప్రిడ్ ౦.౩ మిల్లి లీటర్లు లేదా హోప్తాధయన్ 2 మిల్లి లీటర్లు గాని లీటరు నీటికి కలిపి నల్ల పూత దశలో అనగా పిందెలు ఎదిగే దశలో పిచికారి చేయాలి.

 

పిండిపురుగు :
పిల్ల పురుగు లేత గులాబీ రంగులో ఉండి వాటి మీద తెల్లని పిండిలాగా ఉంటుంది. భూమిలో కాండం మొదలు దగ్గర పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లపురుగులు చెట్టుపైకి పాకి, లేతకొమ్మలు, కాయలు, తొడిమలపై గుంపులుగా చేరి రసాన్ని పిల్చి నష్టపరుస్తాయి. వీటి నివారణకు తొలకరిలో చెట్టు మొదలు దాకా  దగ్గర దగ్గరగా దున్నాలి. లేదా పాదులను తవ్వి తిరిగేయాలి. తర్వాత చెట్టు 2 శాతం మిధైల్ పెరదియన్ లేదా ఎండోసల్పాన్ పొడి మందు చల్లి మట్టిలో కలపాలి. వీటి పిల్ల పురుగులు చెట్ల కాండం మీదకి పాకి పైకి పోకుండా ఉంటాయి. శీతాకాలంలో చెట్టు మొదలుకు భూమి నుండి అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివిగల పాలిధిన్ షిట్ కాండం చుట్టూ చుట్టి, షిట్ పైన గ్రిసుపోయాలి. పిల్ల పురుగులు గ్రీసుపోసిన ప్లాస్టిక్ షీటు అడుగు భాగం నుంచి పైకి పోలేక గుంపులుగా గుమికుడతాయి. అప్పుడు వీటిని పదునైన చాకుతో గీకివేసి నాశనం చేయాలి. లేదా లీటరు నీటికి 2 మిల్లి లీటర్లు ఫాస్పామిడాన్ లేదా 1 మిల్లి లీటర్లు డైక్లోరవాస్ లేదా ౦.౩ మిల్లి లీటర్లు ఇమిడిక్లోప్రిడ్ కలిపి పురుగులపై పిచికారి చేయాలి.

 

ఆకుజల్లెడ గూడు పురుగు :  
ఈ పురుగు క్రిములు ఆకుల ఈనెల మధ్యనున్న కనజలన్ని పూర్తిగా తినేసి ఆకుల్ని జల్లెడలాగా జేసి తర్వాత ఆకుల్ని దగరకు జేసి గూడును ఏర్పరచుకుంటుంది. ఈ పురుగు పూత దశలో పూలను, పూమొగ్గల్ని ఆశించి తరువాత పుగుత్తులని గుడుగా ఏర్పరుస్తుంది.
నివారణ : క్వినాల్ఫాస్ 2 మిల్లి లీటర్లు లేదా కార్బరిల్ ౩ గ్రాములు  లీటరు నీటితో కలిపి జూలై – ఆగస్ట్ నెలలో పిచికారి చేయాలి.

 

టెంక పురుగులు :
ఈ పురుగుల కాయలు చిన్నగా ఉన్నప్పుడే గ్రుడ్లు పెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రిములు లోనికి చొచ్చుకుపోయి టెంకలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రం మూసుకొని పోయి టెంకల లోపల పురుగు ఉన్నట్టు కూడ మనకు తెలియకుండా పోతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే రకాలలో వీటి బెడద ఎక్కువ.
నివారణ: మొనోక్రోటోఫాస్1.6 మిల్లి లీటర్లు లేదా కార్బరిల్ ౩ గ్రాముల మందు 1 లీటరు నీటికి లేదా ఫెనిత్రోదియాన్ 1 మిల్లి లీటరు మందును లీటరు నీటిలో కలిపి పిందె పుట్టిన తర్వాత ఒకసారి చల్లాలి. తరువాత నెల రోజులకు మరోసారి పిచికారి చేయాలి. ఇందువల్ల గ్రుడ్లు, వాటి నుండి వచ్చే పిల్లలు చనిపోతాయి. టెంకలో పురుగు దూరిన తర్వాత మందు చల్లిన ప్రయోజనం ఉండదు. రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.

 

పండు ఈగ :
కాయలు పక్వానికి వచ్చే సమయంలో పండు ఈగ ఉధృతి  ఎక్కువ. లార్వాలు కాయలోని మెత్తని కండను తినడం వల్ల కాయ మెత్తబడి కుళ్ళి రాలిపోతాయి.
నివారణ: రాలిపోయిన పండ్లను ఏరి నాశనము చేయాలి. చెట్టు క్రింద దున్ని కోశాస్థ దశను బయట పడేయాలి. కార్బారిల్ 10% పొడిని భూమిలో (50-100 గ్రాముల/చెట్టుకు కలుపుట), ప్లాస్టిక్ పళ్ళెంలో మిధైల్ యూజినాల్ (2 మిల్లి లీటర్లు), ౩ గ్రాముల కార్బోప్యురాన్ ౩ జిని / లీటరు నీటిలో కలిపి తోటల్లో వేలాడ గట్టాలి.  2 మిల్లి లీటర్ల మలాదియన్ ను లీటరు . నీటిలో కలిపి పిచికారి చేయాలి.

 

తెగుళ్లు :

బూడిద తెగులు :
ఈ తెగులు ఆకుల మిధ, పూ రెమ్మల మీద ఆశించినప్పుడు బూడిద లాంటి తెల్లటి పదార్దం వ్యాపించి పూత, పిందె రాలిపోతుంది. ఇది పూత కాలంలో కనబడుతుంది.
నివారణ : నీటిలో కరిగే గంధకం 2 గ్రా. లేక కేరదేన్ 1 మీ.లీ. లేక మైకోబ్యుటనిల్ 1 గ్రా. లేక బేలటాన్ 1 గ్రా. వీటిలో ఏదైనా ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయాలి.

 

మచ్చ తెగులు :
మచ్చతెగులు అసించినప్పుడు గోధుమ రంగు మచ్చలు ఆకులు, పండ్లు, పూ రెమ్మల మీద ప్రస్పుటంగా కనబడతాయి. తెగులు ఉదృతంగా ఉంటే పూ రెమ్మలు, పిందెలు రాలిపోతాయి.  పుష్ప గుచ్చమంతా మగ్గిపోతుంది. కాపు ఉండదు. తెగులు, పండ్లను ఆశించినట్లయితే ఆవి కుళ్ళిపోతాయి. చిన్న కొమ్మలు ఎండిపోతాయి. గాలిలో తేమ ఎక్కువైనప్పుడు ఇది బాగా వ్యాపిస్తుంది.
నివారణ : ఎండు కొమ్మలను తీసివేసి లీటరు నీటికి ౩ గ్రాముల కాపర్ అక్శిక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. లీటరు నీటికి 1 గ్రా. కార్బండైజిం కలిపి పూత సమయంలో 15 రోజుల వవ్యదిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఎగుమతి చేసే రకాలకు మచ్చతెగులు రాకుండా 15 రోజుల ముందు 1 గ్రా. కార్బడైజిం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

 

మసి మంగు :
ఈ తెగులు కాప్నోడియం అనే శిలీంద్రం ద్వారా వస్తుంది. రసం పిల్చే తేనే మంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్దం పై ఆకుల మీద పిందెలు, కాయల మీద నల్లటి మంగులా పెరుగుతుంది. దీనివలన కిరణజన్య సంయోగ క్రియ అంతరాయం కలుగుతుంది. కాయసైజు తగ్గిపోయి రాలిపోతాయి. కాయల మార్కెట్ కి పనికిరాకుండా పోతాయి.
నివారణ :  రసం పిల్చే పురుగులను సమర్దవంతంగా అరికట్టాలి.  నల్ల మసి మంగు నివారణకు ౩ గ్రాముల  కాపర్ అక్సీక్లొరైడ్ చెట్ల ఆకుల, కొమ్మలు, రెమ్మలు తడిచేటట్లు పిచికారి చేయాలి. ఆకుల మసిని తొలగించుటకు 2  కిలోల గంజి పొడిని గోరువెచ్చని నీటిలో (౩- 4 లీటర్లు)  కలిపి ఉడికించాలి. తరువాత మిగత నీరు పోసి 100 లీటర్ల గంజి ద్రావణం తయారుచేయాలి. తెగులు కనిపించిన భాగాలపై దీనిని పిచికారి చేస్తే మంగు పోతుంది.