| |
పురుగులు
పండు ఈగ :
కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉతి ఎక్కువగా ఉంటుంది. 2మీ.లీ మిథైల్ యూజినల్ మరియు ౩గ్రా. కార్బొప్యూరాన్ ౩జి గుళికలను లీటరు నీటిలో కలిపి తయరు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసలొ 2౦౦ మీ. లీ ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలను వేలదదియాలి. దీని వలన మగ ఈగలు ఆకర్షించబడి, మందు ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మి.లీ మాలాధియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటల్లో పండు ఈగ ఆశింఛి రాలి పడిన కాయలను ఎరివేసి నాశనం చేయాలి. |
 |
|
|
కాండం తొలిచే పురుగు :
పురుగు చెట్ల మొదల్లోకి తొలుచుకుని పోయి పరుగు విసర్జించిన పదార్ధం రంద్రాల్లో నిండి ఉంటుంది. రంద్రాలను శుబ్రపరచి, ఇనుప చువ్వ సహాయంతో పురుగుని చంపి తర్వాత రంద్రల్లో పెట్రోలు లేదా కిరోసినీలోతడిపిన దూదిని వుంచి గని లేదా కర్బొప్యూరాన్ గుళికలను వేసి రంద్రాలను తడిచిన రేగడి మట్టితో పూడ్ఛలి. |
|
తెల్లసుడి దోమ :
వీటి పిల్లపురుగులు ఆకులపై తెల్లని దూదిన వంటి మెత్తని పదార్థంతో కప్పబడి రసం పిలుస్తాయి. ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. ఫిబ్రవరిలో చాల తీవ్రస్తాయికి చేరి నష్టం కలుగుజేస్తాయి. దీని నివారణకు గాను రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తెల్లదోమ ఆశించిన చెట్లవద్ధ ఉంచాలి. ప్రదమ దశలో ఐతే ఆశించిన కొమ్మలను కత్తిరించిన వేసి వేపనునే 5 మీ.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి విటి తరువాత తీవ్రతను తగ్గించవచ్చు. వీటి ఉదృతి ఎక్కువైనచో ఫాస్పోమిడాన్ లేక డైక్లోరోవాస్ లేక హసాథాయాన్ 1మీ .లీ . లీటరు నీటిలో కలిపి ప[పిచికారి చేయాలి. |
|
పిండినల్లి:
చిన్న, పెద్ద, పురుగులు కొమ్మల చివర మరియు కాయలను ఆశించి రసాన్ని పీలుస్తుంది. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగిరు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు (క్రిప్టోలిమస్ మోంట్రీ జియోరి) బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ 1గ్రా. లేదా డైక్లోరవాస్ 1మీ.లీ.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
|
|
తెగుళ్లు
ఎండుతెగులు
వేరు పై తెగులు ప్రారంమైన కొద్ది కాలంలో ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కొమ్మలు పై నుండి క్రిందికి ఎండుతాయి. ఎక్కువగా చెట్టు క్రింది బాగం కొమ్మలు ఏండుతాయి. ఆకులు వడలిపోయి, రాలిపోతాయి. చెట్టు మోడువారుతుంది. చౌడు భూములు ఈ తెగులుకు అనుకూలం. ఈ తెగులు తీవ్రత తగ్గించేందుకు వర్షపు నిరి మొక్కల మొదళ్ళలో నిలవకుండా చూడాలి. మొక్కకు కిలో చొప్పున సున్నం లేదా జిప్సం, పచ్చిరోట్ట ఎరువు లేదా పశువుల ఎరువును ఎక్కువుగా వేసుకోవాలి. మోదళ్ళాలో కర్బాండజిమ్ 1గ్రాము లీటరు నీటిలో కలిపి తడపాలి. తెగులతో ఎండిపోయిన మొక్కలను vvvvvvvvvvvvvvvverlatoవేర్లతో సహా పికీ వేయాలి. చెట్టు చూట్టు1-1 ½ మీటర్ల లోతు వరకు తవ్వి 2 శతం ఫార్మలిన్ ద్రవానంతో గుంతను తడపాలి. 14రోజుల తర్వాత ఎండుటాకులను గుంతలోవేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత క్రొత్త మొక్కలను నాటుకొవాలి. |
| |
కాయకుళ్ళు తెగులు
చెట్టు పై నుండి రెమ్మలు మరియు కొమ్మలు ఎండిపోతాయి. పూర్తిగా మాగినపండ్లపై గుండ్రటి, గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్నగుంతలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యబాగం గులబీ రంగును కలిగి ఉంటాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుల్లిపోతాయి. దీని నివారణకు ఎండిన రెమ్మలను, కొమ్మలను కత్తిరించి కుళ్ళిన పండ్లను తొలగించి, కాపర్ ఆక్సిక్లోరైడ్ ౩గ్రాములులీటరునీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15రోజుల వ్యవదిలో కాయ పూర్తిగా తయారయ్యేవరకు పిచికారి చేయాలి. |
| |
కాపు నియంత్రణ :
ఫిబ్రవరి నుండి మే నేల వరకు నీటిని ఇవ్వడం ఆపాలి. ఇలా చేయడం వలన ఏప్రిల్, మే నెలల్లో చెట్లు ఆకులను రాలుస్తుంది. జూన్ నెలలో పాదులు తీసి, ఎరువులు వేసి నీరు కట్టాలి. నీరు కట్టిన 2౦-25 రోజులలో కోత్త చిగుర్లు వేస్తుంది. చలి కాలంలో వచ్చే పంట (మృగ్ బహార్) మంచి నాణ్యతతో వుంటుంది. వర్షాకాలంలో వచ్చే పంట (అంబేబహార్)ను నియంత్రింఛి చలికాలంలో పంట వచ్చేటట్లు చేయవచ్చును.
కాయకోత తరువాత, కాపు నిచ్చిన కొమ్మలను నాల్గింట మూడు వంతులు కత్తిరించాలి. ఇలా చేయడం వలన దిగిబడి పెరుగుతుంది. కాయలను కోసేటప్పుడు చిన్న రెమ్మలతో కోయటం మంచిది. ఇలా చేయడం వలన కొత్త రెమ్మలను ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి వస్తుంది.
వేరు నుండి పెరిగే పిలకలను తీసివేయాలి. కోత తరువాత ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలను, అడ్డ దిడ్డంగా పెరిగే కొమ్మలను కత్తిరించాలి. మామిడిలో తెలిపిన కలుపు నివారణ చర్యలనే చేపట్టి జామలో కూడా కలుపు నివారించవచ్చు. |
|