లక్షణాలు
పచ్చ దోమ అనేక పంటలను ఆశిస్తుంది. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తాయి. అదే క్రమంలో ఒకరకమైన విష పూరిత లాలాజలాన్ని విడుదల చేస్తుంటాయి. పురుగు సోకిన భాగాలు కాలినట్లు కనపడుతాయి. ఆకులు ముడతబడి పోతాయి. గోధుమ రంగులోకి మారుతాయి. మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. కాయలు కాయడం ఆగిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
 |
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఆడ పురుగు ఆకుల కణజాలం మీద 150 నుంచి ౩౦౦ గుడ్లు పెడుతుంది. 4 – 11 రోజులలో పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
ఆకుల కింద భాగంలో పిల్ల పురుగులు పెద్ద సంఖ్యలో కనపడుతాయి. కదిలించినప్పుడు పక్కలకు పోతుంటాయి. ఉష్ణోగ్రత బట్టి పిల్ల పురుగు దశ ఒక వారం నుంచి 4 వారాల పాటు కొనసాగుతుంది. ఈ దశలో పిల్ల పురుగు 6 రకాలుగా రూపాంతరం చెందుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
తల్లి పురుగు
రెక్కల పురుగు చాలా కాలం బతుకుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించగల్గుతుంది. పరిస్థితులు బాగా లేనప్పుడు నిద్రావస్థలోకి పోతుంది. అనుకూల పరిస్థితులు రాగానే పురుగు త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది.
పురుగు జీవిత చక్రం 14 – ౩0 రోజులలోపల పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో 11 తరాలు పూర్తి అవుతాయి.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఆకుల మధ్య ఈనే, పక్క ఈనెల వెంబడి కనపడుతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు దాదాపు పెద్ద పురుగుల మాదిరిగానే ఉంటాయి. కానీ రెక్కలు ఉండవు. అయితే రెక్కల వంటి మెత్తటి భాగాలను కలిగి ఉంటాయి. పాలిపోయిన ఆకుపచ్చ రంగులో శరీరం ఉంటుంది. తమ శరీరానికి అటూ ఇటూ కదలుతూ ముందుకు పోతుంటాయి. సులభంగా గుర్తించవచ్చు.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశ ఉండదు. |
 |
రెక్కల పురుగు
రెక్కల పురుగు శరీరం తాళం చెవి ఆకారంలో ఉంటుంది. 2 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ముందు రెక్కల వెనుక భాగంలో నల్లటి మచ్చ ఉంటుంది. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డై మీతోయేట్ లేదా 2 మిల్లి లీటర్ల మీతైల్ డేమిటోన్ లేదా 2 మిల్లి లీటర్ల ఫిప్రోనిల్ కలిపి చల్లాలి.
- పురుగు సోకిన భాగాలను తీసి పారెయ్యాలి.
- మిత్ర పురుగులను వదలడం - డిస్తినా ఆల్బినా అనే సాలీడు, క్రిసోపా సిమ్బెలా వంటి పురుగులు పిల్ల పురుగులను తినేస్తాయి. లేమేనాన్ ఎమ్పాస్కే పురుగు గుడ్లను తినేస్తుంది.
|
|
తెల్ల దోమ
Scientific Name: Bemacia tabaci |
లక్షణాలు
తెల్ల దోమ బెండ, పత్తి పంటలను ఆశిస్తుంది. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఫలితంగా మొక్క తన బలాన్ని, మెరుపును కోల్పోతుంది. ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ ను కూడా వ్యాప్తి చేస్తుంది. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
ఒక్కో ఆడ పురుగు దాదాపు 50 గుడ్లు పెడుతుంది. ౩ – 5 రోజులలోపల గుడ్లు పొదగబడతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు కూడా తేలికపాటి పసుపు రంగులోనే ఉంటాయి. గుంపులుగా ఉండి, స్తబ్దుగా ఉంటాయి. వేడి వాతావరణంలో 9 – 14 రోజుల పాటు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు 17 – 81 రోజుల పాటు పిల్ల పురుగు దశ ఉంటుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ 2 – 8 రోజుల పాటు ఉంటుంది.
తల్లి పురుగు
పెద్ద పురుగు శరీరం పసుపు రంగులో ఉంటుంది. పారదర్శకంగా కనపడుతుంది. మైనపు రెక్కల మాదిరి ఉంటాయి. వెనుక కాళ్ళు పొడవుగా ఉంటాయి.
పురుగు మొత్తం జీవిత చక్రం 14 – 120 రోజులలో పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో 14 తరాలు పూర్తి అవుతాయి. ఏడాది పొడవునా సంతానోత్పత్తి జరుగుతుంది. ఒక్కొక్క సారి మగ పురుగుతో కలవకుండానే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది.
పురుగును గుర్తించడం
గుడ్డు దశ
గుడ్లు ఆకుల కింద భాగంలోపల పసుపు రంగులో కనపడుతాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు ఆకుపచ్చ పసుపు రంగులో కనపడతాయి. శరీరం అంచులు బల్ల పరుపు ఆకారంలో ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశలో పురుగు బల్లపరుపు ఆకారంలో ఉంటుంది. ఆకుల అడుగున విశ్రాంతి తీసుకుంటుంది. |
 |
తల్లి పురుగు
తల్లి పురుగులు సైజులో చాలా చిన్నగా ఉంటాయి. శరీరం పసుపు రంగులో ఉంటుంది. పైన తతెల్లటి మైనపు వంటి పూతతో మెరుస్తూ వుంటుంది. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటరు నీటికి 0.4 గ్రాముల అసిటామిప్రిడ్ లేదా 0.4 గ్రాముల తయామీతోక్సాం లేదా 2 మిల్లి లీటర్ల ప్రోఫెనోఫాస్ కలిపి చల్లాలి.
- పసుపు పచ్చ ప్లేట్లు - గ్రీసు లేదా నూనె రాసిన ఈ పసుపు పచ్చ ప్లేట్లకు తెల్ల దోమలు బాగా ఆకర్షించ బడతాయి. హెక్టారుకు 12 ప్లేట్లు పెట్టాలి.
- పురుగు సోకిన ఆకులని ఏరి నాశనం చెయ్యాలి.
- ఈ కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒకదాన్ని సూచించిన మోతాదులో వాడాలి.
- వేప కషాయం చల్లడం – లీటరు నీటికి 50 కిలోల వేప పొడి, 5 మిల్లి లీటర్ల వేప నూనె కలిపి చల్లడం
- ఫిష్ ఆయిల్ రోసిన్ సోప్ - లీటరు నీటికి 25 మిల్లి గ్రాములు
|
|
ఎర్ర నల్లి
Scientific Name: Tetranynchus telarius |
లక్షణాలు
ఎర్ర నల్లి బెండ, పత్తి, వంకాయ పంటలను ఆశిస్తుంది. పురుగులు ఆకుల కణజాలాల నుంచి రసాన్ని పీలుస్తాయి. పురుగు వల్ల బాగా దెబ్బ తిన్న ఆకులు రాగి రంగులో, ఒక రకమైన మెరుపుతో కనపడుతూ ఉంటాయి. మెల్లమెల్లగా వడలి చివరకు రాలిపోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు |
 |
|
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
గుడ్డు దశ 2 – 4 రోజుల పాటు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు దశలో రెండు రకాల రూపాంతరం చెందుతుంది. తరువాత పెద్ద పురుగుగా మారుతుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
ఈ దశ ఉండదు.
తల్లి పురుగు
తల్లి పురుగు జీవిత చక్రం ఒకటి, రెండు వారాలలో పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో అనేక తరాలను పూర్తి చేసుకుంటాయి. తల్లి పురుగు ౩ – 4 వారాల పాటు బతుకుతుంది.
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ
గుడ్లు గుండ్రంగా, తెల్లగా లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి.
పిల్ల పురుగు (లార్వా) దశ
పిల్ల పురుగు తొలిదశలో గులాబి రంగులో ఉంటాయి. మూడు జతల కాళ్ళు ఉంటాయి. తరువాతి దశలలో పురుగు ఆకుపచ్చ ఎరుపు రంగులోకి మారుతుంది. నాలుగు జతల కాళ్ళు ఉంటాయి.
కోశాస్థ దశ (ప్యుపా)
ఈ దశ ఉండదు. |
 |
తల్లి పురుగు
తల్లి పురుగు బల్ల పరుపు ఆకారంలో, ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. నాలుగు జతల కాళ్ళు ఉంటాయి. సైజులో చిన్నగానే ఉంటాయి. రంగు మాత్రం రకరకాలుగా (ఆకుపచ్చ, ఆకుపచ్చ పసుపు, గోధుమ, నారింజ ఎరుపు) ఉంటుంది. రంగు ఏదైనా శరీరం మీద రెండు నల్లటి మచ్చలు కనపడుతాయి. |
|
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- హెక్టారుకు 20 కిలోల గంధకం చల్లడం
- హెక్టారుకు 700 – 900 లీటర్ల మీథైల్ పారాతియాన్ (0.5%) చల్లాలి.
- లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డైకోఫాల్ లేదా కారాథానే కలిపి చల్లాలి
|
|
| ఎనేషన్ లీఫ్ కర్ల్ తెగులు
ఇది జెమిని వైరస్ అనే వైరస్ వల్ల కలిగే తెగులు. బెండ, పత్తి, అనేక ఇతర పంటలను ఆశించే తెగులు ఇది. |
లక్షణాలు
ఆకుల కింద భాగంలో తెగులు లక్షణాలు చాల స్పష్టంగా కనపడతాయి. ఆకుల కింద భాగంలో వాటిపైన సన్నని, చిన్నని సూది మొనల వంటివి పైకి వస్తాయి. క్రమేపి ఇఇవి గరకుగా ఉండే చిన్న చిన్న కురుపుల లాగా తయారవుతాయి. ఈ కురుపులతో పాటు మొక్క ప్రధాన కాండం, కొమ్మలు వంపులు తిరుగుతాయి. ఈ వంపులు తిరగడం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, మొక్క పూర్తిగా నేల మీదకు వంగినట్లు కనపడుతుంది. అయితే ఆకులు మాత్రం ముడత పడకపోవడం గమనించవచ్చు. కానీ ఆకులు కొంత మందంగా మారి మెత్తగా తోలు మాదిరి తయారవుతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే, కొత్తగా వచ్చే ఆకుల కింద కూడా ఈ సూదుల వంటివి, కురుపుల వంటివి వస్తాయి. ఈ ఆకులు కూడా మందంగా, మెత్తగా మారుతాయి. తెగులు సోకిన మొక్కలలో కాయలు తక్కువ వస్తాయి. అవి కూడా చెడిపోతాయి. |
 |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, కాండం , కొమ్మలు, కాయలు
తెగులు జీవిత చక్రం
ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- డై మీథోఎట్ (0.05%) లేదా మొనోక్రోటోఫాస్ (0.02%) మందును, మధ్యలో 10 రోజుల విరామంతో 4- 5 సార్లు చల్లాలి. ఈ మందులు ప్రధానంగా ఈ తెగులు వ్యాప్తి చేసే తెల్ల దోమని నియంత్రిస్తాయి.
- వైరస్ సోకిన మొక్కలని, మొక్క భాగాలను ఏరి నాశనం చేయాలి.
- తెగులు వ్యాప్తి చేసే తెల్ల దోమని నియంత్రించే చర్యలు చేపట్టాలి.
|
|
ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్
ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ వల్ల వచ్చే తెగులు. తెగులును కూడా ఆ పేరుతోనే పిలుస్తారు. బెండ, టమాట, అనేక ఇతర కూర గాయల పంటలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
తెగులు సోకిన మొక్క ఆకుల మీద ఈనెలు పసుపు రంగులోకి మారి, ఒక దానితో ఒకటి అల్లుకుని ఒక గూడు లాగా మారినట్లు కనపడుతాయి. పచ్చని కనజాలాన్ని ఇది కప్పేస్తుంది. తొలుత ఆకుల మీద ఈనెలు మాత్రమే పసుపు రంగులో కనపడుతాయి, కానీ తెగులు పెరుగుతున్న కొద్దీ మొత్తం ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొన్ని సందర్భాలలో, తెగులు సోకిన ఆకులు లేత పసుపు లేదా లేత గోధుమ రంగులోకి మారుతాయి. ఆకుల పైన పచ్చదనం ఏ మాత్రం కనపడదు. కొన్ని సార్లు ఆకుల కింద భాగంలో సూదుల వంటి బొడిపెలు కనపడుతాయి. మొక్క తొలి దశలో తెగులు సోకితే మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు లేత పసుపు రంగులో, ఒక ఆకారం లేకుండా, గరుకుగా మారుతాయి. |
|
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
తెగులు జీవిత చక్రం
ఇది బెండ పంటను బాగా దెబ్బ తేసే తెగులు. మొక్క ఎదిగే అన్ని దశలలోనూ ఈ తెగులు సోకే అవకాశం ఉంది. తెగులు సోకినప్పుడు మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. పంట దిగుబడి తగ్గుతుంది. ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- విత్తేటప్పుడు హెక్టారు పొలంలో కిలో కార్బోఫురాన్ మట్టిలో చల్లాలి.
- తెల్ల దోమ నియంత్రణకు, డై మీతోయేట్ (0.05%) లేదా మెటా సిస్టాక్స్ (0.02%) లేదా నువాక్రాన్ (0.౦5%) మందును, మధ్యలో 10 రోజుల విరామంతో 4-5 సార్లు చల్లాలి.
- లీటరు నీటికి 1.5 మిల్లి లీటర్ల మోనో క్రోటోఫాస్ మందును కలిపి చల్లితే తెగులు నియంత్రణలో ఉంటుంది.
- లీటరు నీటికి 2.5 మిల్లి లీటర్ల క్లోరో ఫైరిఫాస్ లేదా 2 మిల్లి లీటర్ల వేప నూనె కలిపి చల్లిన తెగులును అరికట్టవచ్చు.
- జీవ పద్దతులు
- వైరస్ సోకిన మొక్కలను ఏరి నాశనం చేయాలి.
- తెగులు నిరోధక వంగడాలను వాడాలి (పర్భాని క్రాంతి, అరఖా అభయ్, అరఖ అనామికా, వర్ష ఉపహార్ వంటి వంగడాలను వాడవచ్చు)
- తెల్ల దోమను నియంత్రిస్తే ఈ తెగులును అదుపులో పెట్టవచ్చు.
- తెల్ల దోమ ఎక్కువగా చురుకుగా ఉండే వేసవిలో విత్తేటప్పుడు , తెగులు సోకే అవకాశమున్న వంగడాలను వాడవద్దు.
|
|
Damping off yaa ద్యామ్పింగ్ ఆఫ్
ఇది పైతియం ఎఎస్ పి ఎస్, రిజోక్టోనియా ఎస్ పి ఎస్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. బెండ, టమాట, అనేక ఇతర కూర గాయల పంటలను ఆశిస్తుంది. |
లక్షణాలు
నేలలోంచి మొలక బయటకు రాక మునుపే తెగులు నేలలోపలే విత్తనాన్ని పాడుచేస్తుంది. దానివల్ల మొలక సరిగా రాదు. మొలక వచ్చిన తరువాత తెగులు సోకితే, అవి నిలదొక్కుకోలేక పడిపోతాయి, చివరకు ఎండి చనిపోతాయి. నేలలో ఉండే ఫంగస్ జీవ కణాలు బట్టి, వాతావరణ పరిస్థితుల బట్టి తెగులు తీవ్రత ఆధారపడి ఉంటుంది. తెగులు సోకినప్పుడు బయటకి వచ్చిన లేత మొలకల కాండం దిగువ భాగంలో (నేలకు దగ్గరగా) మచ్చలు కనపడుతాయి. ఈ మచ్చల కింద కణజాలం మెత్తగా మారాదం వల్ల, మొలక నిలదొక్కుకోలేక చచ్చిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
విత్తనాలు, మొలకలు
|
 |
|
తెగులు జీవిత చక్రం
ఇది నేలలో బతికే ఫంగస్. తెగులు నేలలోనే విత్తనాన్ని పాడు చేస్తుంది. లేత మొక్కలకు కూడా నష్టం చేస్తుంది. ఎదగక ముందే మొక్క కృశించి చచ్చిపోతుంది.
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- విత్తన శుద్ధి - కిలో విత్తనాలకు ౩ – 4 గ్రాముల ట్రైకో డేర్మా విరిడి లేదా 2- ౩ కిలోల థైరాం కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
- డైతేన్ ఎం 45 (0.2%) లేదా బవిస్టిన్ (0.1%) మందును మట్టిలో చల్లినా తెగులు నియంత్రణలో ఉంటుంది.
- పంటకు ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు. తేమ ఎక్కువ ఉంటే తెగులు సోకే అవకాశం ఎక్కువ.
- తెగులు సోకిన మొలకలు ఏమైనా ఉన్నాయా అనేది పొలంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
- తెగులు సోకిన మొక్కల మొలకలు ఏమైనా ఉంటే, వాటిని వెంటనే ఏరి నాశనం చేయాలి.
అనుకూల వాతావరణం
చల్లటి, మబ్బులు పట్టిన వాతావరణం, అధిక తేమ ఉన్న పరిస్థితులు, తడి నేలలు, ఇరుకుగా ఉన్న పంట పొలాలు, దగ్గర దగ్గరగా ఉన్న మొక్కలు తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు. |
|
Fusarium wilt ఫుసేరియమ విల్ట్
ఇది ఫ్యుసేరియం ఆక్సి స్పోరం, ఫ్యుసేరియం వాసిన్ స్పెక్తం అనే ఫంగస్ వల్ల వచ్చే తెగులు. బెండ, టమాట, అనేక ఇతర కూరగాయల పంటలను ఆశిస్తుంది. |
 |
లక్షణాలు
తెగులు సోకిన మొక్క ఎండిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. తొలుత ఈ భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. అదే క్రమంలో మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. ఆకులు వడలి రాలిపోతాయి. వేర్ల ద్వారా మొక్కలోని ఆయా భాగాలకు నీరు తగినంతగా అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చివరకు మొక్క చచ్చిపోతుంది.
తెగులు సోకిన కాండాన్ని రెండుగా చీల్చినట్లయితే, కాండం లోపలి కణజాలం నల్లటి ముద్దలుగా మారినట్టు కనపడుతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాండం మొత్తం నల్లగా మారుతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
వేర్లు
తెగులు జీవిత చక్రం
ఫంగస్ ప్రధానంగా మొక్క వేళ్ళ మీద దాడి చేస్తుంది. వేర్లలోని అంతర్ కణజాలం మీద నివసిస్తుంది. దాని వల్ల వేర్లలో నీటి సరఫరా ఆగిపోతుంది. ఫంగస్ నుంచి విడుదల అయ్యే టాక్సిన్లు వేర్లలోని కణాలను పనిచేయకుండా దెబ్బ తీస్తాయి. తెగులు సోకిన మొక్క కాండం కోసి చూసినప్పుడు లోపల నల్లటి చెక్క మాదిరి కనపడుతుంది. అన్ని రకాల వంగడాలకు ఈ తెగులు సోకుతుంది. దీర్ఘ కాలిక పంట మార్పిడి తప్ప తెగులు నివారణకు మరో ప్రత్యామ్నాయం లేదు. |
|
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- తెగులు లక్షణాలు కనపడిన వెంటనే, లీటరు నీటికి 6 గ్రాముల కారాతానే లేదా 1 గ్రాము బవిస్టిన్ మందును కలిపి, మధ్యలో 5 – 6 రోజుల విరామంతో ౩ సార్లు చల్లాలి.
- విత్తన శుద్ధి - కిలో విత్తనాలకు ౩ గ్రాముల మాన్కోజేబ్ కలిపి విత్తనాలను శుద్ధి చేయాలి.
- కాపర్ ఆక్సి క్లోరైడ్ (0.25% ) పొలంలో చల్లాలి.
- జీవ పద్దతులు
- అదే పొలంలో బెండ పంట మాటికి మాటికి వేయకూడదు.
- తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే, దీర్ఘ కాలిక పంట మార్పిడి అవసరం. దీనివల్ల ఫంగస్ జీవ కణాలు తగ్గిపోతాయి.
అనుకూల వాతావరణం
నేలలో అధిక ఉష్ణోగ్రత, అధిక నత్రజని నిల్వలు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఫంగస్ వ్యాప్తి చాల చురుకుగా ఉంటుంది. |
| |