జామ

మన రాష్టంలో జామ సుమారుగా 10042 హెక్టార్లలో సాగవుతోంది. మొత్తంగా 135465 టన్నుల దిగుబడినిస్తుంది.  అనంతపురం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది.   వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. 100 సేం.మీ వర్షపాతం గల ప్రాంతాలు జామ సాగుకు అనుకూలం.  

నేలలు :
ఉదజని సూచిక 4.8 నుండి 8.2 ఉండి, నీరు నిల్వని, లోతైన మురుగు నీటి పారుదల గల నేలలు అనుకూలం  తేలికపాటి ఇసుక నేలలు అంతగా పనికరావు.

రకాలు:
జామాలో తెల్ల, ఎర్ర కండ రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన మైన రకాలు.

   
  1. తెల్ల కండ రకాలు

అలహాబాద్ సఫేదా :
మధ్యస్థ పరిమాణం, గుండ్రని పండ్లు, కండ తెల్లగా మంచి నాణ్యత కల్గి ఉంటుంది. విత్తనాలు చిన్నవిగా, మెత్తగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి 6౦-8౦ క్వింటాళ్ళు దిగుబడి ఉంటుంది.  
లక్నో-49 (సర్తార్) :  
పండ్లు కోలాగా, పెద్ద పరిమాణంలో గరుకు చర్మంతో వుంటాయి. విత్తనాలు పెద్దవిగా, గట్టిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 6౦-8౦ క్వింటాళ్లు ఉంటుంది. 
సఫేద్ జామ (అలహాబాద్ సఫేద * కోహిర్ సెలక్షన్ ) :
పండ్లు మధ్యస్తంగా, గుండ్రంగా పలుచటి తోలుతో మంచి రుచిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 8౦-1౦౦ క్వింటాళ్ళు ఉంటుంది.
కోహిర్ సఫేద (కోహిర్ సెలక్షన్ * అలహాబాద్ సఫేద ) : అత్యధిక దిగుబడి ఇచ్చే రకం. పండ్లు పెద్దగా గింజలు కొంచెం గట్టిగా వుంటాయి.
అర్క మృదుల : అలహాబాద్ సఫేద్ నుంచి ఎన్నుకోబడిన రకం ఇది. పండ్లు గుండ్రంగా, పెద్దవిగా గింజలు మెత్తగా ఉండి, కండ తెలుపు రంగులో తియ్యగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

అర్క అమూల్య (సీడ్ లెస్ జామ * అలహాబాద్ సఫేదా) :
కాయలు మధ్యస్తంగా, తెల్లకండతో తియ్యగా వుంటాయి.విత్తనాలు మెత్తగా వుంటాయి.ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
శ్వేత :
అధిక దిగుబడి నిచ్చే తెలుపు కండ రకం. పండు సుమారు 225 గ్రాములు బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. గింజలు మృదువుగా వుంటాయి. నాటిన ఆరవ సంవత్సరంలో సుమారుగా 1౦౦కిలోల దిగుబడి నిస్తుంది.

ఎర్రకండ రకాలు :

ఎర్రని గుజ్జుగల జామపండ్లు గుజ్జు పరిశ్రమలో వాడకం ఎక్కువుగా వున్నది.
రెడప్లష్ : 
కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి,గింజలు గట్టిగా ఉంటాయి. కండ ఎరుపు రంగుతో ఉంటుంది. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 70-80 క్వింటాళ్ళు ఉంటుంది.
లలిత్ :
అలహాబాద్ సఫేదతో పోలిస్తే 24% దిగుబడి ఎక్కువ ఇస్తుంది. పండు బరువు 185 గ్రాముల నుండి 2౦౦ గ్రాముల వరకు  ఉంటుంది. నిల్వ పదార్దాల తయారికి అనువైన ఎరుపు కండ రకం.
కిరణ్ (కంసారి*పర్పల్  లోకల్) :
ఐ. ఐ. హెచ్.ఆర్. బెంగుళురు నుండి ఈ మద్యనే విడుదలైన రకం. పండు ఎరుపు కండతో మృదువైన గింజలున్న రకం. “లైకోపిన్” అధికంగా ఉంటుంది. జామ పల్ప్ తయారికి అనువైనది.

   

నీటి యాజమాన్యం :
లేత మొక్కలకు 2-౩ రోజులకొకసారి, పెరిగిన చెట్లకు 7-1౦ రోజుల కొకసారి నీరు పారించాలి. నీటి పళ్ళాల పరిధి చెట్టు పెరుగుతున్న కొద్దీ  ఏడాదికి అర్ధ అడుగు చొప్పున పెంచాలి. డ్రిప్ పద్ధతి ద్వార నీరు పారించడం మంచిది.

   

మొక్కలు నాటడం :

నేల అంట్లు గాని, అంట్లు గాని, నాటుకోవచ్చు. మొక్కలను జూన్-జూలైలో గాని, అక్టోబర్-నవంబర్ మాసాల్లో గాని నాటుకోవాలి.  జామను సాధారణంగా నేల అంటు పద్ధతి లేదా చేర్పంటు పద్ధతులతో ప్రవర్తనం చెస్తారు. మొక్కల మధ్య దూరన్ని నేల లోతు, భూసారం సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించాలి. మొక్కలను 5*5 (16౦ మొక్కలు ఎకరాకు) లేదా 6*6 (112మొక్కల ఎకరాక) దూరంలో నాటవచ్చును. 6౦*6౦*6౦ ఘ. సెం. పరిమాణం గల గుంతలను తయారుచేసి ప్రతి గుంతకు 1౦-15 కిలోల పశువుల ఎరువు, 5౦౦గ్రామూల సింగిల్ సూపర్ ఫాస్పేట్ కలిపి నింపాలి.

కొమ్మల కత్తిరింపు  (ప్రూనింగ్ /ట్రేనింగ్) :
ప్రధాన కండపై 2-౩ అడుగుల ఎత్తు వరకు వచ్చే ప్రక్క కొమ్మలను కత్తిరించివేయాలి. 6౦ సెం. లేదా 9౦ సేం పైన రెండు లేదా మూడు కొమ్మలను మాత్రమే పెరిగేటట్లు చూడాలి. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, అడ్డంగా పెరిగే కొమ్మలను తీసివేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను నాలుగింట మూడు వంతులు కత్తిరిస్తే ప్రక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది.

   

ఎరువుల యాజమాన్యం :
(సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ప్రతి చెట్టుకు)

    చెట్టు వయస్సు (సం.)

నత్రజని (యూరియ  (గ్రా.)

భాస్వరం (సింగిల్ సూపర్ ఫాస్పేట్ గ్రా.)

పోటాష్ (మ్యూరేట్ ఆఫ్ పోటాష్గ్రా.)

పశువుల ఎరువు (కిలోలు)

1
2

      1౦౦ (217)
      2౦౦ (4౩4)

       4౦( 25౦)
       8౦ (5౦౦)

   1౦౦ (17౦)
   2౦౦ (౩4౦)

      15
     ౩౦

      ౩౦౦ (651)

       12౦ (75౦)

   ౩౦౦ (51౦)

     45

4

     4౦౦ (868)

     16౦ (1౦౦౦)

   4౦౦ (48౦)

     6౦

5

     5౦౦ (1౦85)

     2౦౦ (125౦)

   5౦౦ (85౦)

     1౦౦

 
పోషక లోపాలు ; ఆకులు ఎరుపు రంగులోనికి మారినపుడు భాస్వరం, పోటాష్, జింక్, సేంద్రీయ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయనిక ఎరువువలతో పాటు సేంద్రీయ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4గ్రా. జింక్ సల్పేట్ మరియు 2గ్రా. బోరిక్ యాసిడ్ ఒక లీటరు నీటికీ కలిపి పిచికారి చేయాలి.
జింకులోపం – సవరణ : ఈ నేల మద్య పత్రహరితం కోల్పోయినట్లు కనపడి, ఆకులు మరీ చిన్నవిగా వున్నప్పుడు లీటరు నీటికి 2గ్రా. జిమక్ సల్పెటును కలిపి పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
మెగ్నీషియం లోపం – సవరణ : నీటి ఎద్దటి రాగానే ప్రాంతాలలో ఇది ఎక్కువుగా కనిపిస్తుంది. పంట తొలిదశలో ఆకులు రంగులు కోల్పోయి, వాలిపోయి వుంటాయి. వేసవికాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి.2గ్రా.ల మెగ్నీషియం సల్పేట్  లీటరు నీటిలో కలిపి 15రోజుల వ్యవదిలో రెండుసార్లు పిచికారి చేసి ఈ లోపాన్ని సవరించవచ్చు.

కలుపు నివారణ / అంతరకృషి :
వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నడం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రాటాఫ్ ఎకరకు 80౦ గ్రా. 24౦ లీటర్ల నీటిలో  కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లైసేల్ లేదా రౌండప్ కలుపు మందును కలిపి దానితోపాటు 20 గ్రా. అమ్మోనియం సల్ఫేట్ గాని, 10 గ్రా. యురుయా కలిపి 20 -25 రోజుల కలుపు పై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మిధ పడకుండ జాగ్రత్త వహించాలి. (చీని, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం, పండ్లతోటల్లో కూడ ఇదే విధంగా కలుపు నివారించవచ్చు. )