వంకాయ   
ఆంధ్రప్రదేశ్ లో వంకాయ 27000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అవుతోంది. మొత్తంగా దాదాపు 5. 5 లక్షల టన్నుల దిగుబడినిస్తుంది.

 

నేలలు:
బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు.

 

రకాలు    


రకం

పంటకాలం

గుణ గణాలు

దిగుబడి (/)

భాగ్యమతి

150-165  

నీటి ఎద్దడిని,కాయ తొలచు పురుగును,  వెర్రి తల వైరస్ తెగులును బాగా తట్టుకుంటుంది. కోస్తా ఆంద్ర ప్రాంతానికి అనుకూలం. 

6.5-8.0

 శ్యామల

 

130-150

 

ఈ రకం మసాలా వంటకాలకు పేరు.   తెలంగాణా ప్రాంతానికి అనువైనది.

6.5-8.0

గులాబి

140-160

కాయలు మద్యస్థ పొడువుగా ఉండి, 3-4 కాయలు గుత్తులుగా ఉంటాయి.  ఆకర్షనీయంగా లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి.  తెలంగాణా,కోస్తా, ఆంధ్రా ప్రాంతాలకు   అనుకూలం.   

13-14

పూసా పర్పుల్  క్లస్టర్ 

135-140

కాయలు ఉదారంగులో ఉండి గుత్తులుగుత్తులుగా కాస్తాయి. ఎండు తెగులును బాగా తట్టుకుంటుంది. 

12-16

పూసా పర్పుల్ లాంగ్

134 -140

కాయలు పొడవుగా (25-30 సెం.మీ) ఉండి, ఉదా రంగులో నవనవలాడుతూ ఉంటాయి.

12-16

పూసా క్రాంతి

135-150

కాయలు కొంచెం లావుగా మద్యస్థ పొడవుతో ఉండి ఉదారంగులో ఆకర్షనీయమైన ఆకుపచ్చ తొడిమకల్గి ఉంటాయి.

14-16

 

 

నేల తయారి:
నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి.వర్షాకాలపు పంటను బోదెలు,కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం మరియు వేసవి పంటకు 4*5చ,,మీ.మళ్ళను తాయారు చేసుకోవాలి.

 
   
 
 

విత్తడం / నాటడం
విత్తే సమయం: :
జూన్ - జూలై లో శీతాకాలపు పంటను, అక్టోబర్-నవంబర్లో  వేసవికాలపు పంటను వేస్తారు. జనవరి రెండవ పక్షం నుండి ఫెబ్రవరి మొదటి పక్షం వరకు నారు కోసం విత్తవచ్చు.
విత్తనం:
ఎకరాకు సూటి రకాలకు 260 గ్రాములు , ,సంకరజాతి రకాలకు 120 గ్రాముల  విత్తనం కావాలి.
నారు నాటుకునే సమయం:
30-35 రోజుల నారును నాటుకోవాలి.వర్ష కాలం నారును జూలై-ఆగష్టులో చలికాలం నారును నవంబర్-డిసెంబర్లో,వేసవి కాలం నారును ఫెబ్రవరి-మార్చ్ మొదటి వారం లో నాటవచ్చు.

నారుమడి పెంపకం:
6 అంగుళాలు ఎత్తు ఉండే 1*4 మీ.సైజు గల నారు మళ్ళను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకు 10-12 నారు మళ్ళ నారు సరిపోతుంది. 260 గ్రాముల విత్తనాన్ని 10 సెంటి మీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిముషాలు పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేదా మాంకోజెబ్ అనే మందు తో విత్తన శుద్ధి చేయాలి. ఆ తరువాత కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మ విరిడి కల్చర్ ను కూడా పట్టించి విత్తుకోవాలి.
విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపించే అవకాశం ఉంది. మాగుడు తెగులు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మడులలో నిలిచినప్పుడు ఆశిస్తుంది. మొక్కల మొదల్ల వద్ద కుళ్ళి నారు చనిపోతుంది. నారు ఏ దశలో నయినా ఈ తెగులు ఆశిస్తుంది. అప్పుడు వెంటనే కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల  చొప్పున కలిపి వారం రోజుల మద్య వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారు మడిని బాగా తడపాలి. నారును పీకడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోప్యురాన్ గుళికలను (1౦౦ చదరపు మీటరు నారు మడికి) వేయాలి.
నాటే దూరం:
పొడువుగా, నిటారుగా పెరిగే రకాలకు (పూసా పర్ఫ్ ల్ లాంగ్, పూసపర్ఫ్ ల్ క్లస్టర్,పూసా పుర్ఫ్ ల్ రౌండ్,భాగ్యమతి,శ్యామల) 60*60 సెం. మీ. ల దూరం, గుబురుగా పెరిగే రకాలకు(పూసా క్రాంతి,అర్క కుసుమాకర్,గులాబీ) 75*50 సెం. మీ. ల దూరం పాటించి నాటాలి.

 
 
 

నీటి యాజమాన్యం
నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకొక్కసారి, వేసవిలో 4-5 రోజులకొక్కసారి, వర్ష కాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. సాధ్యమైనంతవరకు వేసవిలో కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు నీటి తడులు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి. బరువైన నల్ల రేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.

 

కలుపు యాజమాన్యం

విత్తిన లేదా నాటిన 24 - 48 గంటలలో అలా క్లోర్ (తేలిక నేలలకు లీటరు, బరువు నేలలకు 1.5 లీటర్లు)  ఎకరాకు పిచికారి చేయాలి. నాటిన 25,30 రోజులప్పుడు గొర్రు లేదా గుంతకతో అంతర కృషి చేయాలి. పై వాటితో పాటు ఎరువులు వేసే ప్రతి సారి గోతి త్రవ్వి బోదెలు సరి చేస్తే పంట బాగా పెరుగుతుంది.
 

ఎరువుల యాజమాన్యం:

ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్), 24 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యురియా), 3 సమ బాగాలుగా చేసి నాటిన ౩0వ, 60వ రోజు, తిరిగి 75వ రోజున పై పాటుగా వేయాలి. సంకర జాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50 శాతం పెంచాలి.